Chandrababu Arrest Updates: నేడు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌..

ఇన్నర్ రింగ్ రోడ్‌ కేసులో చంద్రబాబును సీఐడీ చేర్చడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరుగనున్నాయి. మరికాసేపట్లో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ.

New Update
Chandrababu Arrest Updates: నేడు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌..

Chandrababu Arrest Updates: బెయిల్ వచ్చేనా? ఈ కేసులో కూడా అరెస్ట్ చేస్తారా? చంద్రబాబు(Chandrababu) కేసులో అసలేం నడుస్తోంది? ఇంట్రస్టింగ్ వివరాలను తెలుసుకుందాం. ఇన్నర్ రింగ్ రోడ్‌ కేసులో చంద్రబాబును సీఐడీ చేర్చడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరుగనున్నాయి. మరికాసేపట్లో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని‌ రమేష్ లకు లబ్ది చేకూర్చారని కౌంటర్ లో పేర్కొంది సీఐడీ. మరోవైపు.. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పై కేసు నమోదు చేసిందని ఆరోపిస్తున్నారు చంద్రబాబు తరపు అడ్వకేట్లు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై మెమో దాఖలు చెయ్యనుంది సీఐడీ. మొత్తంగా చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ కీలక తీర్పు వెలువడనుందనే చెప్పాలి.

Also Read:

Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

Hyderabad: బాబోయ్.. బంగారు కొండలు, వెండి గుట్టలు.. మ్యాటర్ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Advertisment
తాజా కథనాలు