Chandrababu Arrest Updates: నేడు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్..
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును సీఐడీ చేర్చడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరుగనున్నాయి. మరికాసేపట్లో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ.