IRCTC: ఒక్కరోజులో కోట్లు కొల్లగొట్టింది.. ఎలా అంటే..

IRCTC ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 7,852 కోట్ల రూపాయలను సంపాదించింది. సోమవారం అంటే డిసెంబర్ 18న IRCTC షేర్లు 14% జంప్ అయ్యాయి. దీంతో IRCTC మార్కెట్ క్యాప్ రూ.70,328 కోట్లకు చేరింది. IRCTC సైట్‌లో ప్రతి నెల దాదాపు 3.45 కోట్ల లావాదేవీలు జరుగుతాయి.

IRCTC: ఒక్కరోజులో కోట్లు కొల్లగొట్టింది.. ఎలా అంటే..
New Update

IRCTC: రైల్వే రంగంలోని ప్రధాన సంస్థ ఐఆర్‌సిటిసి షేర్లు సోమవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక్కరోజులోనే 14 శాతం జంప్ చేసి చివరకు 12 శాతానికి పైగా లాభంతో ముగిసింది. ఇదొక్కటే కాదు..  ఐఆర్సీటీసీ కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,852 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఐఆర్సీటీసీ పరుగులకు కారణాలేమిటో తెలుసుకుందాం. 

IRCTC షేర్లు సోమవారం రూ.782.05 వద్ద ప్రారంభమయ్యాయి. రోజు ట్రేడింగ్‌లో రూ.888.90కి చేరింది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ షేర్లు రూ.879.10 వద్ద ముగిశాయి. ఈ విధంగా కంపెనీ షేర్లు 12.57 శాతం పెరుగుదలతో ముగిశాయి.

24 గంటల్లో రూ.7,852 కోట్లు.. 

IRCTC షేర్ల కారణంగా, దాని పెట్టుబడిదారులు ఒక్క రోజులో 7,852 కోట్ల రూపాయలు ఆర్జించారు. వాస్తవానికి శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,476 కోట్లుగా ఉంది. కాగా సోమవారం మార్కెట్ బూమ్ మధ్య రూ.70,328 కోట్లకు చేరింది. ఈ విధంగా కేవలం 24 గంటల్లోనే కంపెనీ ఇన్వెస్టర్లు రూ.7,852 కోట్లు ఆర్జించారు.

Also Read: కేంద్రానికి డైరెక్ట్ టాక్స్ ల డబ్బుల వర్షం.. ఈ ఏడాది ఎంత వచ్చిందంటే..

IRCTC షేర్ల పరుగులకు కారణాలివే.. 

ఐఆర్సీటీసీ షేర్లు పెరగడానికి చాలా కారణాలున్నాయి. శీతాకాలపు సెలవుల్లో ప్రజలు ఏక్కువగా  టిక్కెట్లు బుక్ చేసుకోవడం దీనికి ప్రధాన కారణం. భారతదేశంలో రైల్వే టిక్కెట్ బుకింగ్‌లో ఐఆర్సీటీసీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ఐఆర్సీటీసీ సైట్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక ట్రాఫిక్‌ను అందుకుంటుంది. IRCTC గురించిన ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

  • ప్రతిరోజు 62 లక్షల మంది IRCTC సైట్‌కి లాగిన్ అవుతున్నారు.
  • ఐఆర్సీటీసీ సైట్‌లో ప్రతి నెల 3.45 కోట్ల లావాదేవీలు జరుగుతాయి.
  • 2022లో IRCTC వెబ్‌సైట్ - మొబైల్ యాప్‌లో సగటున 11 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
  • ఐఆర్సీటీసీ తన క్యాటరింగ్ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇప్పుడు రైల్వేతో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ, కాటన్ యూనివర్శిటీ వంటి విభాగాల క్యాటరింగ్‌ను ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. 
  • భారతీయ రైల్వే రాబోయే రోజుల్లో అనేక కొత్త రైళ్లను ప్రారంభించబోతోంది. దీనివలన ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫారమ్‌లో టికెట్ బుకింగ్ బాగా పెరుగుతుంది. 

Watch this interesting Video:

#stock-market-news #irctc #e-ticketing
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe