Israel-Iran War: ఈ రాత్రికే యుద్ధం.. దాడికి సిద్ధమైన ఇరాన్!

ఈ రాత్రికే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా బ-ఆవ్ లక్ష్యంగా ఇరాన్ దాడి చేసేందుకు సిద్ధమైంది. ఇరాన్ ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్స్ మిలటరీ డ్రిల్ మొదలుపెట్టింది. ఇరుదేశాల్లో విమాన రాకపోకలు ఆగస్టు 21 వరకు రద్దు చేశారు.

Israel-Iran War: ఈ రాత్రికే యుద్ధం.. దాడికి సిద్ధమైన ఇరాన్!
New Update

Israel-Iran War: ఈ రాత్రికే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా బ-ఆవ్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇవాళ రాత్రికి టిషా బ-ఆవ్ వేడుక ప్రారంభం కానుండగా రేపటి వరకూ ఇజ్రాయెల్‌లో పండగ వాతావరణం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పండగ వాతావరణంలో ఇజ్రాయెల్ పై అటాక్ చేయాలని ఇరాన్ పక్కా ప్లాన్‌తో మందుకెళ్తోంది.

పశ్చిమాసియాకు అణ్వాయుధాలు..

భూమార్గం నుంచే దాడి చేయాలని స్కెచ్ వేసిన ఇరాన్.. ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్స్ మిలటరీ డ్రిల్ మొదలుపెట్టింది. పశ్చిమ ఇరాన్‌లో యుద్ధ సన్నాహకాలు కొనసాగిస్తోంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యాయి. పశ్చిమాసియాకు అణ్వాయుధాలు మోసుకెళ్లే సబ్‌మెరైన్‌ ఇప్పటికే ఇజ్రాయెల్ పంపించింది అమెరికా.పశ్చిమాసియా జలాల్లోకి అబ్రహం లింకన్ వార్‌షిప్‌, టెల్‌ అవీవ్ చేరిన F-22 ఫైటర్ జెట్స్ ను ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంచింది. మరొకవైపు హిజ్బొల్లా దళాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం నేపథ్యంలో టెల్ అవీవ్, టెహరాన్, బీరుట్, అమ్మాన్‌లో విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు.

ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న ఇరాన్..

ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను చంపిన ఇజ్రాయెల్ పై ఇరాన్ కోపంతో రగిలిపోతుంది.ఈ రాత్రి దాడి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ జనరల్ లాయిడ్ ఆస్టిన్.. గైడెడ్ మిస్సైల్ సబ్‌మెరైన్ యుఎస్ఎస్ జార్జియాను త్వరగా మధ్యప్రాచ్యానికి చేరవేయాలని ఆదేశించారు.154 ల్యాండ్ అటాక్ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో కూడిన ఈ జలాంతర్గామి మధ్యధరా సముద్రం వైపు కదిలివెళ్తోంది. యుద్ధ వాతావరణానికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అవసరమైన ప్రతి చర్యను అమెరికా తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

#flights-canceled #tonight #iran-israel-war
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe