Chandrababu Naidu: కేంద్రానికి బాబు స్పెషల్ రిక్వెస్ట్..ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఆ ఐపీఎస్‌ అధికారి!

ఏపీ కేడర్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి మహేష్‌ చంద్ర లడ్హా ను తిరిగి రాష్ట్రానికి పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరారు. ఈ రిక్వెస్ట్‌ గురించి కేంద్రం సానుకూలంగా స్పందించింది. మహేష్‌ చంద్ర లడ్హాను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏపీ ప్రభుత్వం నియమించనుంది.

Chandrababu Naidu: కేంద్రానికి బాబు స్పెషల్ రిక్వెస్ట్..ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఆ ఐపీఎస్‌ అధికారి!
New Update

Ap:  ఏపీ ప్రభుత్వ కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ ల కోసం కేంద్రానికి స్పెషల్‌ రిక్వెస్టులు చేస్తుంది. ఇప్పటికే పవన్‌ కేబినెట్‌ లోకి కేరళ నుంచి ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ ని ప్రత్యేకంగా రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఐపీఎస్‌ అధికారి కోసం ఈసారి ఏకంగా బాబుగారే రంగంలోకి దిగారు.

ఏపీ కేడర్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి మహేష్‌ చంద్ర లడ్హా ను తిరిగి రాష్ట్రానికి పంపించాలని సీఎం కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరారు. ఈ రిక్వెస్ట్‌ గురించి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో డిప్యుటేషన్‌పై సీఆర్పీఎఫ్‌లో ఐజీగా పని చేస్తున్న మహేష్‌కుమార్‌ లడ్హాను ఏపీకి పంపేందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

డిప్యుటేషన్‌ గడువుకు ముందే ఆయనను రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహేష్‌ చంద్ర లడ్హాను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించేందుకు బాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆయన ఏపీ కేడర్ 1998 బ్యాచ్ అధికారి కాగా.. ఏపీలో పలు హోదాల్లో మహేష్‌ పనిచేశారు. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను ఏరికోరి మరీ తిరిగి ఏపీ కేడర్‌కు తీసుకు వస్తున్నారు.

రాష్ట్రంలో కీలకమైన ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతల్ని అప్పగించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మహేష్ చంద్ర లడ్హా కేంద్రం నుంచి రిలీవ్ కానున్నారు.. ఏపీ కేడర్‌లో చేరబోతున్నారు. లడ్హా ఏపీలోని వివిధ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. తర్వాత విశాఖపట్నం సీపీగా విధులు నిర్వహించారు. ఐజీగా పదోన్నతి దక్కింది. ఆ తర్వాత ఆయన డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..!

#central-govt #ips #chnadrababu #mahs-ladha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe