Medaram: మేడారం జాతరలో బీట్‌ ఆఫీసర్‌పై ఎస్పీ దురుసు ప్రవర్తన

మేడారం జాతరలో బీట్‌ ఆఫీసర్‌పై ఎస్పీ దురుసు ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న AR ASIపై ఎస్పీ గౌస్ అలం చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. హంతకుడిని తీసుకెళ్లినట్లుగా లైన్లో నుంచి తన భర్తను గల్లా పట్టుకుని ఎస్పీ లాక్కెళ్లారని ASI భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.

New Update
Medaram: మేడారం జాతరలో బీట్‌ ఆఫీసర్‌పై ఎస్పీ దురుసు ప్రవర్తన

Medaram: మేడారం జాతరలో బీట్‌ ఆఫీసర్‌పై ఎస్పీ దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న AR ASIని ఎస్పీ గౌస్ అలం అవమానించినట్లు తెలుస్తోంది. మేడారంలో డ్యూటీ చేస్తున్న తన భర్తపై ఎస్పీ గౌస్ అలం చేయి చేసుకున్నారని ఎఎస్ఐ భార్య ఆరోపిస్తోంది. తనకు ఆరోగ్యం బాలేదని, అందుకే తన భర్త తనను నేరుగా దర్శనానికి తీసుకెళ్తుండగా అదే టైంలో ఎస్పీ వచ్చి తన భర్తపై చేయి చేసుకున్నారని ASI భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Also Read: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!

అప్పటికే అక్కడున్న కానిస్టేబుల్స్‌ని రిక్వెస్ట్ చేసి వీఐపీ లైన్లో దర్శనానికి వెళ్లామని ASI భార్య వాపోయింది. హంతకుడిని తీసుకెళ్లినట్లుగా లైన్లో నుంచి తన భర్తను గల్లా పట్టుకుని ఎస్పీ లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన కళ్ల ముందే తన భర్తకు పనిష్మెంట్ ఇవ్వడం చాలా బాధగా, అవమానంగా అనిపించిందని కన్నీటి పర్యంతం అయింది.

చివరికి ఎస్పీ కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని మండిపడింది. చాలా మంది అధికారుల్ని తన భర్త చూశాడు కానీ ఎవరూ ఇలా మోకాళ్లపై నిలబెట్టలేదని చెప్పుకొచ్చింది. మేడారం జాతరలో కిందిస్థాయి అధికారుల పాత్ర ఎంతుందో అధికారులు గమనించాలని కోరింది. తమకు జరిగిన అవమానానికి ఇంకోసారి మేడారానికి..రావొద్దని నిర్ణయించుకున్నామని వాపోయింది.

Also Read: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

ఇదిలా ఉండగా.. మేడారంలో సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం పూర్తి అయింది. చిలకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నెపల్లికి సారలమ్మ చేరుకున్నారు.
వర్షం పడుతుండగా పున్నమి వెన్నెల్లో తల్లులు అడవిబాట పట్టారు. అమ్మవార్ల వన ప్రవేశం టైంలో చిరుజల్లులు పడటం ఆనవాయితీ. పూజారులు అమ్మవార్లను తీసుకు వెళ్లడానికి.. గద్దెల వద్దకు రాగానే చిరు జల్లులు మొదలయ్యాయి. పూజలు నిర్వహిస్తుండగా వర్షపు జల్లులు పడటంతో భక్తులు పులకించిపోయారు. అమ్మల చల్లని చూపు భక్తజనంపై ఉంటుందని తెలియజేయడానికే వర్షం పడుతుందని భక్తుల నమ్మకం. 28న సంప్రదాయబద్ధంగా తిరుగువారం పండుగ జరుగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు