IPL: ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా?

భారత మాజీ కెప్టెన్, చెన్నై ఛాంపియన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ చివరి టోర్నీ అవుతుందా అనే చర్చ గత కొన్ని సీజన్‌లుగా సాగుతోంది. ఈసారి ఆ చర్చకు బలం చేకూరుస్తూ రుతురాజ్ కు ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు.

IPL:  ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా?
New Update

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ప్రస్తుత ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి విజయాన్ని ప్రారంభించింది. మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్‌లో కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు .రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టు కెప్టేన్సీ బాధ్యతలు అందాయి. చెన్నై అభిమానులకు ఓ పెద్ద వార్త రాబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ కోటలో ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ మ్యాచ్ జరగవచ్చని చెబుతున్నారు.

(ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే అవకాశం ఉందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు తెలిపాయి. ఒక క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా, రెండో క్వాలిఫయర్ చెన్నైలో జరగనున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్స్ (చెన్నై సూపర్ కింగ్స్) సొంత మైదానంలో ప్రారంభ మ్యాచ్‌లు ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించే సంప్రదాయాన్ని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుసరిస్తోంది" అని బిసిసిఐ సీనియర్ అధికారి పిటిఐకి తెలిపారు.

భారత మాజీ కెప్టెన్, చెన్నై ఛాంపియన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ చివరి టోర్నీ అవుతుందా అనే చర్చ గత కొన్ని సీజన్‌లుగా సాగుతోంది. ప్రతిసారీ వాయిదా వేసినా ఈసారి యువతకే కెప్టెన్సీ అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతో బహుశా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా అది నెరవేర్చలేక తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు రుతురాజ్‌లో కాబోయే కెప్టెన్‌ని జట్టు చూస్తోంది.

#dhoni #csk #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe