IPL Auction 2024: రోహిత్‌ ఫ్యాన్స్‌ నిరసనల వేళ ఐపీఎల్‌ వేలం.. ఆక్షన్‌లో ప్రధాన ఆటగాళ్ల లిస్ట్ ఇదే!

రేపు(డిసెంబర్‌ 19) దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో అందరిచూపు ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, మిచెల్ స్టార్క్‌, జోష్ హేజిల్వుడ్‌, ప్యాట్ కమిన్స్, డారిల్ మిచెల్, వానిందు హసరంగపైన పడింది. వీరికి భారీ ధర పలికే అవకాశాలున్నాయి.

New Update
IPL Auction 2024: రోహిత్‌ ఫ్యాన్స్‌ నిరసనల వేళ ఐపీఎల్‌ వేలం.. ఆక్షన్‌లో ప్రధాన ఆటగాళ్ల లిస్ట్ ఇదే!

ఈసారి ఐపీఎల్‌(IPL) ఫీవర్‌ టోర్ని మొదలవకముందే స్టార్ట్ అయ్యింది. నిజానికి ప్రతీసారి వేలం సమయానికి ఫ్యాన్స్‌ కాస్త అలెర్ట్ అవుతారు. ఆక్షన్‌(Auction)లో తమ జట్టు ఎలాంటి ఆటగాళ్లను కనుగోలు చేస్తుందోనని చూస్తుంటారు. వేలాన్ని ఫాలో అవుతారు. అయితే సారి వేలం ప్రారంభానికి ముందే ఐపీఎల్‌ డిస్కషన్‌ పీక్స్‌కు దాటింది. ముంబై ఇండియన్స్‌ తమ జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌పాండ్యాను ఎంపిక చేయడమే దీనికి కారణం. ఈ విషయంలో రోహిత్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న నిమిషం నుంచి ఇప్పటివరకు క్రికెట్‌ సర్కిల్స్‌లో ఇదే చర్చ. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వేలం రోజు రావడం ఐపీఎల్‌ ఫీవర్‌ను ఇప్పుడే పెంచేసినట్టు అయ్యింది. 2024 సీజన్‌ కోసం రేపు(డిసెంబర్ 19) ఆక్షన్‌ జరగనుంది. ఈసారి దుబాయ్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌లో కొంతమంది ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటగాళ్లు కనిపించబోతున్నారు. వారుపై ఓ లుక్కేయండి.

మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 77 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండటం, విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్లు అందుబాటులో ఉండటంతో ఐపీఎల్లో 10 జట్లలో ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

వేలంలోని కీలక ఆటగాళ్ల లిస్ట్:
--> ట్రావిస్ హెడ్
--> రచిన్ రవీంద్ర
--> మిచెల్ స్టార్క్
--> జోష్ హేజిల్వుడ్
--> ప్యాట్ కమిన్స్
--> డారిల్ మిచెల్
--> వానిందు హసరంగ
--> లాకీ ఫెర్గూసన్
--> శార్దూల్ ఠాకూర్
--> గెరాల్డ్ కోట్జీ
--> హర్షల్ పటేల్
--> అర్షిన్ కులకర్ణి
--> షారుక్ ఖాన్
--> కార్తీక్ త్యాగి

ఐపీఎల్ వేలం 2024లో అత్యంత పిన్న వయస్కుడు, వృద్ధ ఆటగాళ్లు ఎవరు?
ఐపీఎల్ వేలంలో షార్ట్‌ లిస్ట్‌ అయిన అతి పిన్న వయస్కుడిగా దక్షిణాఫ్రికాకు చెందిన 17ఏళ్ల క్వేనా మపాకా ఉండగా.. అఫ్ఘాన్‌కు చెందిన 38 ఏళ్ల మహ్మద్ నబీ అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు.

దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 వేలానికి మల్లికా సాగర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

Also Read: క్రికెట్‌ స్టేడియంలో ఉరేసుకున్న యువకుడు.. షాక్‌లో గ్రౌండ్‌ సిబ్బంది!

WATCH:

Advertisment
తాజా కథనాలు