IPL 2024 Opening Ceremony : గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్..స్పెషల్ అట్రాక్షన్ గా రెహమాన్.!

ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు బోర్డు సన్నాహాకాలు చేస్తోంది. మార్చి 22న సాయంత్రం 6.30గంటలకు ఈవెంట్ షురూ కానుంది. ఈ ఈవెంట్లో ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.

IPL 2024 Opening Ceremony : గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్..స్పెషల్ అట్రాక్షన్ గా రెహమాన్.!
New Update

IPL 2024 Opening Ceremony :  దేశంలో ఐపీఎల్ ఫీవర్ ప్రారంభం అయ్యింది. మార్చి 22వ తేదీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సీజన్ ను కూడా ఘనంగా ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డు భావిస్తోంది. సీజన్ ప్రారంభం రోజు చెన్నై చిదంబరం స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అంటే మార్చి 22 సాయంత్రం 6.30 గంటల ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ లో భారీ లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

ఈ ఈవెంట్ కు ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ పాల్గొంటారు. ఇక వీరితోపాటు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ఫ్రాఫ్ కూడా ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేయనున్నారు. ప్రోగ్రామ్ లో సింగర్ సోనూ నిగమ్ ముందుగా ఆటాపాటలతో ప్రేక్షకులను ఆలరించనున్నారు. ఆ తర్వాత సింగర్ రెహమాన్ గ్రూప్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉండనుంది.

చివరి అరగంటల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్ టైగర్ కలిసి సూపర్ హిట్ పాటలకు డ్యాన్సులు చేసే అవకాశం ఉంది. చివర్లో రెహమాన్ , సోనూ వీరితో కలిసి డ్యాన్స్ చేస్తారని తెలుస్తోంది. అసలే హై వోల్టేజ్ మ్యాచ్ కావడంతో మాములుగానే సీఎస్కే ఆర్సీబీ మ్యాచ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందులో సోనూ, రెహమాన్, అక్షయ్ కుమార్, టైగర్ పెర్ఫార్మెన్స్ అంటే సీజన్ కు ఈవెంట్ కు ప్రత్యేకం కానుంది. దీంతో మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్ కు వెళ్లే అభిమానులకు డబుల్ ట్రీట్ పక్కా అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: ముస్లింల కోసం దావూద్ చాలా చేశాడు..అండర్ వరల్డ్ డాన్‌పై స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

#csk-vs-rcb-ipl-2024 #2024-ipl-inauguration-ceremony #2024-ipl-inauguration-celebrities #2024-ipl-opening-event #2024-ipl-ceremony-perfomances
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe