IPL 2024: ఐపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్ అప్పుడే.. డిటైల్స్ ఇవే.. 

ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో పాల్గొనే ఆటగాళ్లను పొందడం కోసం అన్ని ఫ్రాంఛైజీస్  రెడీ అయ్యాయి. ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్ల వేలంలో  మొత్తం 333 మంది నుంచి 77 మంది ప్లేయర్స్ ను టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది. వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో జరుగుతుంది 

New Update
IPL 2024 : భారత అభిమానులకు షాక్.. ఐపీఎల్ యూఏఈకు తరలనుందా?

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి ముందు జరిగే వేలంలో ఉండే ఆటగాళ్లందరి లిస్ట్ వచ్చింది. ఈసారి ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది.  ఇందుకోసం అన్ని జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. BCCI నుంచి వచ్చిన  ప్రకటన ప్రకారం, ఈసారి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.  అందులో 214 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు. ఈసారి ఈ జాబితాలో రెండు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా చేరారు. మొత్తం 333 మంది ఆటగాళ్లలో 111 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. జట్లలో మొత్తం 77 మంది ఆటగాళ్లు ఉంటారు. అంటే 333 మంది ఆటగాళ్లలో 77 మంది ఆటగాళ్లను మాత్రమే ఈ వేలం ద్వారా తీసుకుంటారు.  ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.

బేస్ ధర ఎక్కువ ఉన్నవారిలో  23 మంది ఆటగాళ్లు ఉన్నారు, వీరి బేస్ ధర రూ. 2 కోట్లు. కాగా, 13 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.1.5 కోట్లు. చాలా మంది ఇతర ఆటగాళ్ల బేస్ ధర రూ. 1 కోటి, 50 లక్షలు, 30 లక్షలు - 10 లక్షలుగా ఉంది. వేలానికి కొద్దిసేపటి ముందు, అన్ని జట్లు తమ టీమ్స్ నుంచి బయటకు వెళ్ళిపోయిన, టీమ్ వదులుకున్న ఆటగాళ్ల లిస్ట్ ను ఇప్పటికే విడుదల చేశాయి.  అందులో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. 

ఈసారి ఐపీఎల్ వేలంలో(IPL 2024) చాలా ఇంట్రస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు. వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌పై సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ కూడా వేలంలోకి వచ్చాడు. అతని ప్రాథమిక ధర రూ. 2 కోట్లు. వీరితో పాటు మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, జోష్ ఇంగ్లిస్ వంటి ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొననున్నారు. వీరందరి బేస్ ధర కూడా రూ.2 కోట్లుగా ఉంది. 

Also Read: నిమిషం లేటైతే 5 పరుగులు ఇచ్చుకున్నట్టే.. క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్

ఈసారి IPL 2024కి ముందు, చాలా పెద్ద మార్పులు కూడా జరిగాయి. వీరిలో, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యా వేలానికి ముందే తన జట్టును విడిచిపెట్టి ముంబై ఇండియన్స్‌లో చేరగా, గుజరాత్ టైటాన్స్ యువ శుబ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా చేసింది. అలాగే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 2024లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అతను కారు ప్రమాదం తర్వాత మొదటిసారిగా గ్రౌండ్స్ లో కనబడే ఛాన్స్ ఉంది. 

IPL 2024 ఫ్రాంఛైజీల దగ్గర వేలంలో ఖర్చు చేయడం కోసం మొత్తం 262.95 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ ఫ్రాంఛైజీలు మొత్తం 77 మంది క్రికెటర్లలో ఎక్కువాలో ఎక్కువగా 30 మంది విదేశీ ప్లేయర్స్ ను కొనుక్కునే అవకాశం ఉంటుంది. విదేశీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్ లకు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. వీరి కనీస ధర 2 కోట్లరూపాయలుగా ఉంది. ఇక న్యూజీలాండ్ స్టార్ క్రికెటర్ రచిన్ రవీంద్ర మినిమమ్ ధర 50లక్షలుగా ఉంది. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు