IPL 2024 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడనున్నాయి.
IPL 2024 Finals: ఈ మ్యాచ్‌లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, శనివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం కూడా ఉదయం వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది…
IPL 2024 Finals: ఆఖరి మ్యాచ్‌లో టాస్‌కు ముందు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఓవర్లను తగ్గించడం జరగదు. రెండు గంటల అదనపు సమయం ఇస్తారు. అంటే రాత్రి 9.40 గంటలకు ముందు మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్ కట్ ఉండదు. దీని ప్రకారం, 2 జట్లు 20 ఓవర్లు ఆడతాయి. (మరో ఆటంకం ఏర్పడే సూచన ఉన్నా.. ఒకవేళ ఆట మధ్యలో మరో అంతరాయం వచ్చినా.. ఓవర్ల తగ్గింపు జరగవచ్చు)
IPL 2024 Finals: వర్షం కారణంగా ఆలస్యం అయ్యి.. రాత్రి 9.40 గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లను కుదిస్తారు. అంటే ఆలస్యం అయిన ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక ఓవర్ చొప్పున కట్ చేస్తారు.
IPL 2024 Finals: ఫైనల్ కోసం అదనంగా 120 నిమిషాలు కేటాయించారు. అంటే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ సమయం 3 గంటల 15 నిమిషాలు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగితే అదనంగా 2 గంటలు వినియోగిస్తారు. అంటే రాత్రి 7.30 నుంచి ఒంటి గంట వరకు ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంటుంది.
IPL 2024 Finals: అయితే మ్యాచ్ జరగకపోయినా లేదా పూర్తికాకపోయినా మ్యాచ్ రిజర్వ్ డే ప్లేగా ఉపయోగించబడుతుంది. రిజర్వ్ డే ప్లేలో, నిర్ణీత రోజున ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడ నుంచి మ్యాచ్ తిరిగి కొనసాగిస్తారు.
రిజర్వ్ డే ప్లేలో కూడా నిర్ణీత సమయంలో మ్యాచ్ ఆడకపోతే అదనపు సమయం పడుతుంది. దీని ద్వారా 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించవచ్చు. ఈ 5 ఓవర్ల మ్యాచ్ రాత్రి 11.56 గంటలకు ప్రారంభమై 12.56 గంటలలోపు ముగిసే పరిస్థితి ఉందో లేదో రిఫరీ పరిశీలిస్తారు. 11.56 నుంచి 12.56 మధ్య 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించలేకపోతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అంటే, రిజర్వ్ డేలో మ్యాచ్ జరగకపోతే ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ మ్యాచ్ అవుతుంది.
వర్షం కారణంగా కనీసం సూపర్ ఓవర్ మ్యాచ్ అయినా ఆడలేకపోయిన పరిస్థితి ఉంటేనే ఫైనల్ రద్దవుతుంది. అలాగే లీగ్ స్థాయిలో 70 మ్యాచ్‌లు ఆడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది.
దీని ప్రకారం ఫైనల్ మ్యాచ్ వర్షం కురిసి.. ఆట జరిగే పరిస్థితి లేకపోతే మాత్రం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ చాంపియన్ గా నిలుస్తుంది. రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి రావచ్చు.