టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ప్రశాంత్ కిశోర్ కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇకపై ప్రశాంత్ కిశోర్ టీమ్ చంద్రబాబుకు పని చేస్తుందని ప్రచారం జరిగింది. ఇంతలోనే వైసీపీ నేతలు ప్రశాంత్ కిశోర్ టార్గెట్‌గా మండిపడ్డారు కూడా. పీకే ఏం పికలేడంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది పీకేలు వచ్చినా గెలిచేది జగనేనంటూ చెప్పుకొచ్చారు. ఐపాక్ టీమ్ టీడీపీకి పని చేయడం ఫిక్స్ అని అంతా అనేసుకున్నారు. కానీ ఇంతలోనే ట్విస్ట్.. ఐపాక్ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది. ఆ ట్వీట్ ప్రకారం ఐపాక్ టీమ్ జగన్‌తోనే ఉన్నట్టు అర్థమవుతోంది..
'I-PAC గత సంవత్సరం నుంచి YSRCP పార్టీ సహకారంతో పని చేస్తోంది. 2024లో జగన్ మళ్లీ ఘనవిజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన తిరుగులేని ప్రయత్నాలను కొనసాగించే వరకు అవిశ్రాంతంగా పనిచేయడానికి మేము అంకితభావంతో ఉన్నాము' అని ట్వీట్ చేసింది. ఇకచంద్రబాబు సీనియర్ నాయకుడని.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్టు చెప్పుకొచ్చారు పీకే.
మొదట గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్ ను కలిసిన ప్రశాంత్ కిషోర్ అనంతరం ఆయనతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లి మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలపై కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు దీర్ఘంగా చర్చించారు. తాము నిర్వహించిన సర్వేలోని అంశాలను ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు తన అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలను ప్రశాంత్ కిషోర్ కు వివరించారు. గెలుపే లక్ష్యంగా తాము అనుసరించబోతున్న వ్యూహాలను పీకే దృష్టికి తెచ్చారు.
Also Read: రాయుడుని రిప్లేస్ చేసే ఆటగాడు అతడే.. అసలు విషయం చెప్పేసిన ధోనీ టీమ్ సీఈవో!