Pavitra Jayaram: పవిత్ర జయరామ్ కన్నడ టీవీ సీరియల్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. కన్నడలో జోకలి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 2018లో నిన్నే పెళ్లాడతా సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
నిన్నే పెళ్లాడతా సీరియల్ లో తల్లిగా పవర్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించిన పవిత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర తెలుగులో మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు.
2020 లో త్రినయని సీరియల్ లో తిలోత్తమగా నెగటివ్ షెడ్ లో బుల్లితెర అభిమానులను ఆకట్టుకున్న పవిత్ర మరింత పాపులర్ అయ్యారు.
పవిత్ర జయరాం ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి, అమ్మాయి. చందన్ కుమార్, ప్రతిక్ష. పవిత్ర అబ్బాయికి 22 ఏళ్ళు , పాపకు 19 ఏళ్ళు.
అయితే త్రినయని సీరియల్ చేస్తున్న సమయంలో.. అదే సీరియల్ ఆమెకు తమ్ముడి క్యారెక్టర్ చేసిన చంద్రకాంత్ అనే నటుడితో పవిత్రకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళకు ఈ పరిచయం చాలా దగ్గరి బంధంగా మారింది.
గత ఐదేళ్లుగా వీరిద్దరూ కలిసే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇద్దరికీ సంబంధించిన వీడియోలు, రీల్స్ కూడా తరచూ షేర్ చేస్తూ ఉండేవారు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడిక్కడే మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. అదే వాహనంలో ఆమెతో పాటు ప్రయాణించిన చందు గాయాలతో బయటపడ్డాడు.
ఇక పవిత్రను ప్రాణంగా ప్రేమించిన చందు ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బాధను తట్టుకోలేక అతను కూడా ఆహ్మహత్య చేసుకొని చనిపోయారు.
అయితే చందుకు కూడా 2015లోనే పెళ్లి జరిగింది. శిల్ప అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. ఆ తర్వాత పవిత్రతో పరిచయం ఏర్పడిన చందు కుటుంబానికి దూరంగా వచ్చేశాడు. గత ఐదేళ్లుగా నటి పవిత్రతో కలిసి ఉన్నారు.
కాగా, త్వరలోనే వీరిద్దరూ తమ మధ్య ఉన్న అన్ అఫీషియల్ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని అనుకున్నారట. కానీ ఇంతలోనే పవిత్ర చనిపోవడం తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చందు.