/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/history-of-google-how-it-began-and-whats-happening-beyond-2019.jpg)
Interruption Of Google Services : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కొద్దిసేపు గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్ (Gmail), సెర్చ్, యూట్యూబ్ (YouTube) యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అమెరికా టైమింగ్స్ (America Timings) ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది.
అమెరికా, యూకేతో పాటు యూరోప్, ఆసియా, సౌత్ అమెరికాలోని పలు ప్రాంతాల్లో నెటిజన్లు సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ కారణంగా విండోస్‌లో తీవ్ర సమస్య తలెత్తగా, తాజాగా గూగుల్ (Google) కు సమస్య ఎదురవడం గమనార్హం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమెరికాలో లక్షలాదిమంది ఉదయం పని ప్రారంభించిన సమయంలో వారి మెయిల్స్ పని చేయలేదు. గూగుల్ సెర్చ్ కూడా చేయలేకపోయారు. యూట్యూబ్ లో వీడియోలు చూడలేకపోయారు. అమెరికాలో 57 శాతం మంది సెర్చ్, 32 శాతం మంది వెబ్ సైట్, 11 శాతం మంది గూగుల్ డ్రైవ్‌తో సమస్యను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు.