Tech Tips : మీ మొబైల్లో నెట్ సరిగ్గా రావట్లేదా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి... రాకెట్ కంటే స్పీడ్ గా వస్తుంది...!!

ఫోన్ లో ఇంటర్నెట్ సరిగ్గా రాకుంటే కోపం మామూలుగా రాదు. మీ ఫోన్ లో మొబైల్ డేటా సరిగ్గా పనిచేయనట్లయితే...కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. మీ ఫోన్ కొన్ని నిమిషాలపాటు ఎయిర్ ప్లేన్ లో మోడ్ లో ఉంచి ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే మొబైల్ డేటా నెట్ వర్క్స్ సరిగ్గా పనిచేస్తాయి.

New Update
Smartphone : స్మార్ట్‌ఫోన్ వాడుతున్న 10మందిలో ఆరుగురు ఈ తప్పు చేస్తున్నారు..ఏంటో తెలుసా?

మొబైల్ ఫోన్లలో సరైన నెట్ వర్క్ లేకపోవడమనేది సాధారణ విషయమే. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చాలా మంది ఎన్నో రకాల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ నెట్ స్పీడ్ పెరగకపోవచ్చు. ఫోన్ లో ఇంటర్నెట్ లేకుంటే పనులన్నీ చాలా వరకు ఆగిపోతాయి. స్లో మొబైల్ డేటా కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. మీకు కూడా చాలా సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటుంది.

జనరల్ గా నెట్ స్పీడ్ లేకుంటే..టెలికాం ఆపరేటర్ దే తప్పని చాలాసార్లు మనం భావిస్తుంటాం. నెట్ వర్క్ లో నిరంతర సమస్యలు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. పూర్తిగా టెలికాం ఆపరేటరే కారణం అనుకోవడం తప్పు. నెట్ వర్క్ సరిగ్గా రాకపోవడానికి కారణాలు ఏంటి?వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫోన్ లో నెట్ వర్క్ సరిగ్గా రానట్లయితే...మీరు మొబైల్ ను కొన్ని నిమిషాలపాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేసి...మళ్లీ నార్మల్ మోడ్ సెట్ చేయండి. చాలా సందర్భాల్లో ఫ్లైట్ మోడ్ ఆన్ లో ఉన్నప్పుడు మొబైల్ డేటా నెట్ వర్క్ లు సరిగ్గా పనిచేస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

మీరు భౌతిక సిమ్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే..దాన్ని ఫోన్ నుంచి తీసివేసి..కొంత సమయం తర్వాత తిరిగి సెట్ చేసుకోవచ్చు. అప్పుడు సిమ్ బాగా పనిచేస్తుంది. అనేక సందర్బాల్లో ఇది మీ సమస్యకు వెంటనే పరిష్కారంగా ఉంటుంది. అప్పుడు సిమ్ నెట్ వర్క్ సిగ్నల్స్ ను బాగా తీసుకుంటుంది. ఒకవేళ మీరు రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నట్లయితే..సెట్టింగ్స్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ నెట్ వర్క్ ను సెలక్ట్ చేసుకోండి. దీని కోసం మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఐఫోన్ కస్టమర్లు ముందుగా మీరు సెట్టింగ్స్ కు వెళ్లాలి. ఆ తర్వాత మొబైల్ డేటాను నొక్కాలి. తర్వాత మొబైల్ డేటా స్విచ్చింగ్ ను అనుమతించు అనే ఆప్షన్ కు వెళ్లాలి.

దీనికోసం ఆండ్రాయిడ్ కస్టమర్లు ముందుగా సెట్టింగ్స్ కు వెళ్లాలి. ఆ తర్వాత వారు మొబైల్ నెట్ వర్క్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్ మెనేజ్ మెంట్ కు వెళ్లి..కాల్స్ సమయంలో డేటా కనెక్షన్ మార్చు ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ డేటాను ఎక్కువ వినియోగించడం జరుగుతుంది. చాలా రీఛార్జ్ ప్లాన్స్ రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. అవి నెట్ వినియోగం కారణంగా తొందరగా అయిపోతాయి. ఆ పరిస్థితిలో మీ డేటా అయిపోయిందా ఇంకా ఉందా అనేది మీరోసారి చెక్ చేసుకోవాలి.

ఇక చాలా సందర్భాల్లో మొబైల్ నెట్ వర్క్ సరిగ్గా రాకపోవడానికి కారణం మీ డివైజ్ లేటెస్ట్ అప్ డేట్ తో ఇన్ స్టాల్ చేయకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అందువల్ల మీ ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో అప్ డేట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి.

ఇది కూడా చదవండి: నేడు సూరత్ డైమండ్ బర్స్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ…దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు