నేడు ప్రపంచ బ్లడ్ డోనర్ డే... బ్లడ్ డోనర్ డే సందర్భంగా... ఏ రక్తాన్ని ఏ వ్యక్తికి ఇవ్వడం కుదురుతుందో తెలుసుకుందాం... అలానే ఎందుకు ఇవ్వాలి.. అసలు ఈ రక్తనమూనాలను ఎలా గుర్తిస్తారు.. అత్యవసరమైతే తప్ప మనకు ఈ డౌట్ రాదు కదా... అయితే ఇదంతా పక్కన పెడితే.... సాధారణంగా సగటు మనిషి రక్తాన్ని A, B, AB, O గ్రూపులుగా విభజించారు. ఎర్రరక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా ఈ గ్రూపులను నిర్ణయిస్తారు. A-యాంటిజన్ ఉంటే Aగ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు.
అలాగే ఎర్రరక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. అంటే ఎర్రరక్త కణాలపై యాంటిజన్‌తో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగిటివ్ అంటారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం, మన దేశంలో A పాజిటివ్ బ్లడ్ 21.8%, A నెగిటివ్ బ్లడ్ 1.36%, B పాజిటివ్ బ్లడ్ 32.1%, B నెగిటివ్ బ్లడ్ 2% AB పాజిటివ్ బ్లడ్ 7.7%, AB నెగిటివ్ బ్లడ్ 0.48%, O పాజిటివ్ 32.53%, O నెగిటివ్ బ్లడ్ 2% మందిలో ఉంది. AB పాజిటివ్, AB నెగిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూపులతో పాటు మరో రెండు అత్యంత అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బాంబే బ్లడ్ గ్రూపు కాగా, రెండోది గోల్డెన్ బ్లడ్ గ్రూపు అన్నమాట.