సిన్వర్ మృతి..సంచలన విషయాలు వెలుగులోకి..

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందారు. సిన్వార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాక  పోస్ట్ మార్టం నిర్వహించారు.  అతని తలపై బుల్లెట్ గాయం ఉందని..దాని కారణంగానే మరణించి ఉంటాడని చెబుతున్నారు. 

New Update
Yahya Sinwar 2

Yahya Sinwar Post Martom: 

హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మరణం ఒక సంచలనం. ఇతన్ని చంపాక ఇజ్రాయెల్ హామాస్ మీద నైతిక విజయం సాధించింది. దాన్ని చాలా మట్టుకు నాశనం చేశామని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సిన్వార్ మరణం వెనక కారణాలు, అతను ఎలా చనిపోయాడో వివరాల మీద ఇంకా ఇజ్రాయెల్ పరిశోధనలు చేస్తూనే ఉంది. తాజాగా సిన్వార్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. ఇందులో ఆయన ఎలా చనిపోయాడో వివరాలు కనుక్కున్నారు. సిన్వర్ చేతికి గాయమైంది. అది ట్యాంక్ లేక మిస్సైల్‌ నుంచి వచ్చిన షెల్ వల్ల ఆ గాయమై ఉండొచ్చని అంటున్నారు. రక్తాన్ని ఆపేందుకు అతడు చేతిచుట్టూ ఒక వైర్‌ను చుట్టుకున్నాడని రిపోర్ట్‌లో వచ్చిందని చెబుతున్నారు. తరువాత గన్‌షాట్ వల్ల అతడు మరణించాడని చెప్పారు. అయితే ఎవరు, ఎప్పుడు కాల్చారనేది మాత్రం తెలియడం లేదని అంటున్నారు. 

సిన్వార్ అని తెలియదు..

సాధారణంగా నిర్వహించే పెట్రోలింగ్‌లో భాగంగా ఒక భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. శిథిలమైన భవనం లోపల హమాస్‌ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలుసుకునేందుకు ముందు డ్రోన్‌ను పంపించారు. ఇంతకు ముందు సిన్వర్ అంటూ వచ్చిన వీడియోలు అవే. అయితే అందులో ఉన్నది సిన్వార్ అని ఐడీఎఫ్‌ గుర్తించలేదు. కానీ హమాస్ మిలిటెంట్ ఉన్నాడు కదాని బాంబు ప్రయోగించారు. దాంతో భవనం కుప్పకూలి అతడు మరణించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్‌ అని తెలిసిందని ఐడీఎఫ్ చెబుతోంది. అతడి శరీరంపై బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌, గ్రనేడ్లు ఉన్నాయి అని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ చెప్పారు. 

డీఎన్ఏ టెస్ట్..

అయితే చనిపోయాక కూడా అది సిన్వార్ అవునా కాదా అనే విషయం ఐడీఎఫ్‌కు తెలియలేదు. దాంతో బాడీ డీఎన్‌ఏ ను టెస్ట్ చేశారు. దాని కోసం అతని వేలును కత్తించారు. మృతుల్లో ఒకరికి సిన్వర్ పోలికలు ఉన్నట్లు అనుమానం కలగడంతో అతడు ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో పోల్చాం. చివరకు ఆ మృతదేహం అతడిదేనని ధ్రువీకరించుకున్నాం అని ఐడీఎఫ్ చెబుతోంది 

Advertisment
Advertisment
తాజా కథనాలు