మరికొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు..స్వింగ్ స్టేట్స్‌లో ముందంజలో ఎవరు?

దశాబ్దం తర్వాత అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పదేళ్ళుగా ఎవరు గెలుస్తారనేది ముందే తెలిసిపోయింది. కానీ ఈసారి మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

author-image
By Manogna alamuru
usa
New Update

USA Elections:

మరికొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయెరికాలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇప్పటికి 7.5 కోట్ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు రేపు మంగళవారం ఫైన్ ఓటింగ్‌కు దేశమంతా ప్రిపేర్ అవుతోంది. రేపు 5 గంటలకు ఓటింగ్ మొదలవనుంది. 

అమెరికాలో రెండే పార్టీలు ఉంటాయి. వీటి నుంచి ఇద్దరే అధ్యక్ష పీఘం కోసం పోటీ పడతారు మొత్తం 50 రాష్ట్రాల్లో చాలా మట్టుకు  రిపబ్లికన్, డెమొక్రటిక్‌ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే కావడంతో వాటిని సేఫ్‌ స్టేట్స్‌గా పిలుస్తారు. అయితే ఇలా సేఫ్ స్టేట్స్‌లోకి రాని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అవే స్వింగ్ స్టేట్స్. ఇక్కడ ఎవరు గెలుస్తారు...ఎవరు ఆధిక్యం సాధిస్తారు అన్నదాని బట్టే గెలుపు నిర్ణయం అవుతుంది. ఇవి మొత్తం ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్‌ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా.. ఈ ఏడు రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ఓట్లను సాధించినవారే అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు. ఇక్కడ ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారు అన్నది చివర వరకు తెలియదు. 

50 రాష్ట్రాలు...538 ఎలక్టోరల్ ఓట్లు..

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుండగా...538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో గెలడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు.  సేఫ్ స్టేట్స్ ద్వారా డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ 226 ఓట్లు,  ట్రంప్ 219 ఓట్లు కచ్చితంగా గెలుస్తారు. దీంతో మిగిలిన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో 93 ఓట్లు కీలకంగా మారాయి. ఇండులో ట్రంప్ గెలవాలంటే 51 ఓట్లు సాధించాలి. కమలా హారిస్‌కు మాత్రం 44 ఓట్లు వస్తే సరిపోతాయి. మళ్​ళీ ఈ ఏడు రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా కీలకంగా మారింది. ఇక్కడ 19 ఎలక్టోరల్ ఓట్ల విషయంలో సందేహం నెలకొంది. ఇప్పుడు ఇవే అమెరికా అధ్యక్షుడు ఎవరన్నది డిసైడ్ చేస్తాయని చెబుతున్నారు. 

స్వింగ్ స్టేట్స్..

ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో రస్ట్‌ బెల్ట్‌ రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిషిగాన్, పెన్సిల్వేనియాలు కూడా కీలకంగా మారాయి. కార్మిక సంఘాలకు పట్టు ఉండే ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 44 ఓట్లున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సన్‌ బెల్ట్‌ రాష్ట్రాలైన నెవడా, అరిజోనా, నార్త్‌ కరోలినా, జార్జియాలో మొత్తం 49 ఓట్లున్నాయి. రన్ బెల్గ్ రాష్ట్రాల్లో మొదటి నుంచీ డెమోక్రాట్లదే పైచేయి. ఈసారి కూడా ఇది జరిగితే కనుక కమలా హారిస్‌కు రావాల్సిన 44 ఓట్లు ఈజీగా వచ్చేస్తాయి. లేదూ ఒకవేళ ట్రంప్ గెలిచారు అంటే...మరో 7 ఓట్లు అవసరం అవుతాయి. అయితే ట్రంప్ కచ్చితంగా గెలవాలంటే..నాలుగు రాష్ట్రాల్లో స్వీప్ చేయాల్సి ఉంటుంది. సన్ రాష్ట్రాల్లో రెపబ్లికన్స్‌కు పటటు ఉంది. అక్కడ మడింటిలో ట్రంప్ గెలిచినా...మరో దానిలో కూడా కచ్చితంగా గెలవాల్ఇన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్‌లో ప్రస్తుతానికి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారని చెబుతున్నారు. 48 శాతం ట్రంప్‌కు అనుకూలంగా ఉందని...ఆయన కమలా హారిస్ కంటే 1.8 శాతం ఎక్కువ ఉన్నారని చెబుతున్నారు. 

Also Read: Stock Market: 6 లక్షలు హుష్ కాకి..భారీ నష్టాల్లో సూచీలు

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe