India Military: చైనాకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన భారత్ ఈ వార్ ఎక్సర్‌సైజ్‌లో చైనా లైఫ్‌లైన్ ఎనర్జీ ట్రేడ్ మార్గం టార్గెట్‌గా కసరత్తు జరుగుతుంది. కొంతకాలంగా సముద్రంలో ఉన్న ఇతర పొరుగు దేశాలైన తైవాన్, ఫిలిప్పీన్స్‌పై చైనా ప్రతాపం చూపిస్తోంది. చైనా దురహంకారాన్ని బయట పెట్టేందుకు భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది. By Vijaya Nimma 07 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update India Military షేర్ చేయండి India Military: చైనా దురహంకారాన్ని బయట పెట్టేందుకు భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ సహా నాలుగు అగ్రరాజ్యాలు సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. మలబార్ నౌకాదళ విన్యాసాలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో అభ్యాస వ్యూహాలు, సవాళ్ల గురించి చర్చిస్తారు. భారత తూర్పు నౌకాదళ కమాండ్ ఈ విన్యాసాల్లో పాల్గొనబోతోంది. బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు చైనా తన వ్యూహాలను నిరంతరం కొనసాగిస్తోంది. అలాంటి పరిస్థితిలో శత్రువులకు గట్టి హెచ్చరిక జారీ చేసేందుకు భారత్ QUAD సభ్య దేశాలతో మలబార్ యుద్ధ కసరత్తును నిర్వహించబోతోంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లకు చెందిన నౌకాదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి. సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అరికట్టడానికి.. ఈ వార్ ఎక్సర్‌సైజ్ అక్టోబర్ 8 నుంచి బంగాళాఖాతంలో ప్రారంభం కానుంది. చైనా లైఫ్‌లైన్ ఎనర్జీ ట్రేడ్ మార్గం టార్గెట్‌గా ఈ కసరత్తు జరుగుతుంది. ఇది మన సముద్ర భద్రతను బలోపేతం చేయడమే కాకుండా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అరికట్టడానికి పెద్ద అడుగు అవుతుందని అంటున్నారు. మలబార్ ఎక్సర్‌సైజ్ ద్వారా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ఒక్కటవుతున్నాయి. బహిరంగ ఇండో-పసిఫిక్ గురించి నాలుగు దేశాలు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాయి. కొంతకాలంగా సముద్రంలో ఉన్న ఇతర పొరుగు దేశాలైన తైవాన్, ఫిలిప్పీన్స్‌పై చైనా ప్రతాపం చూపిస్తోంది. అలాంటి పరిస్థితిలో ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో భారతదేశం జతకట్టడంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పప్పులు ఉడకవని పరోక్ష సంకేతాలు అందుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వేపకాయల బతుకమ్మ..ఆ పేరెందుకు వచ్చింది? #india-military మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి