USA President life:
ప్రపంచ అగ్రదేశం అమెరికా. అందరికీ పెద్దన్న. ఈదేశానికి అధ్యక్షుడు అంటే ఒకరకంగా ప్రపంచానికి అధనేత అనే చెప్పాలి. మరి అలాంటి అధినేత లైఫ్ అంటే మామూలుగా ఉండదు. అతనికి ఇచ్చే సదుపాయాలు సాధారణంగా ఉండదు. సకల సౌకర్యాలతో వైట్ హౌస్‌లో...వెలకట్టలేని జీతంత, 24/7 ఈగ కూడా వాలకుండా చూసుకునే భద్రతా సిబ్బంది ఉంటారు. అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి 4 లక్షల డాలర్ల జీతం ఇస్తారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.3.3 కోట్లు. ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్ 2001లో నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే జీతాన్ని ఇస్తున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడిగా రిటైరయ్యాక వార్షికంగా 2 లక్షల డాలర్లు లభిస్తుంది. 1 లక్ష డాలర్లు అలవెన్సు రూపంలో లభిస్తుంది. ఇది కేవలం జీం మాత్రమే. ఇది కాకుండా ప్రెసిడెంట్ అధికారిక ఖర్చుల కోసం ఏడాదికి 50 వేల డాలర్లు ఇస్తారు. దీనికి ఎటువంటి పన్నూ ఉండదు. ఇవి కాక ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్లు అందుతుంది. ఈ మొత్తాలన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి లభించేది 5.69 లక్షల డాలర్ల పైమాటే. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగు పెట్టే ముందు వారికి కావల్సినట్టు ఇంటిని మార్చడానికి మరో లక్ష డాలర్లు అదనంగా ఇస్తారు.
ఇక అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లోనే నివాసం ఉంటారు. పరిపాలనా అక్కడి నుంచే చేస్తారు. కుటుంబ సభ్యులతో కలసి కూడా అక్కడే ఉంటారు. వైట్ హౌస్ మొత్తం ఆరు అంతస్తుల భవనం..దీనిని 1800లో నిర్మించారు. అయితే కాలక్రమేణా దీనిని ఇప్పటి తరానికి తగ్గట్టుగా మరాచుకుంటూ వచ్చారు. 55 వేల చదరపు అడుగుల కలిగిన ఈ భవంతిలో 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి. అధ్యక్షుడికి విందు కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు.
Also Read: USA: డోనాల్డ్ ట్రంప్ గెలవడానికి ముఖ్య కారణాలు ఇవే...