USA Elections:
అమెరికా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి వరకూ ఇది కొనసాగనుంది. అక్కడక్కడ సాంకేతిక సమస్యలు, బ్యాలెట్ ప్రింటింగ్‌లో లోపాలు, వాతావరణ వల్ల సమస్యలు, బూటకపు బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైనప్పటికీ..ఎక్కువ సేపు నిలబడలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పోలింగ్ పర్యవేక్షకులను కొన్ని ఎన్నికల కేంద్రాల్లో అనుమతించలేదనే వార్తలు వచ్చాయి. అయితే సమస్య వెంటనే పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇకడ కొన్ని బ్యాలెట్ యంత్రాలలో కూడా సమస్యలు వచ్చాయి. దాంతో ఇక్కడ పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించారు. ఇల్లినాయిస్‌లో ఛాంపియన్ కౌంటీలో సాంకేతిక లోపాలు, కెంటకీలోని లూయీవిల్‌లో ఈ-పోల్‌బుక్‌లతో సమస్యల వలన పోలంగ్ ప్రక్రియ్ కాస్త ఆలస్యమైంది.
ఇక ఆరిజోనాలోని మారికోపా కౌంటీలో.. పోలింగ్ కేంద్రం తాళం చెవి మర్చిపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది. మరోవైపు
మిస్సోరిలో వరదల కారణంగా సెయింట్ లూయీ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి ప్రజలు కష్టపడ్డారు. ఇక మరికొన్ని చట్ల పోలింగ్ కేంద్రాల్లో షూటర్లు ఉన్నారు. బాంబులు ఉన్నాయి అంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే తర్వాత అవన్నీ అబద్ధపు కాల్స్ అని తేలింది. ఇవి రష్యన్ ఈ మెయిల్ డొమైన్‌ల నుంచి ఎఫ్‌బీఐ తెలిపింది.
Also Read: USA: మెలానీయాతో కలిసి ఓటేసిన ట్రంప్..కాలిఫోర్నియాలో కమలా ఓటు