US Election Results: ఉపాధ్యక్షుడిగా మన తెలుగింటి అల్లుడే! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ వాన్స్ గెలిచిన సంగతి తెలిసిందే. వాన్స్ మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ. By Bhavana 06 Nov 2024 in ఇంటర్నేషనల్ విజయవాడ New Update షేర్ చేయండి US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ కృష్ణాజిల్లాకు చెందిన ఉయ్యూరు అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో గెలుపు కోసం 270 ఓట్లు అవసరం కాగా.. రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్ లీడ్‌ను దాటడంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షులు అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాధ్యక్షుడిగా జెడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడు అవుతున్నారు. Aslo Read : ఓ మై ఫ్రెండ్...అంటూ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ! ఇంతకీ ఈ వాన్స్ ఎవరో కాదు..మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా చేశారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. Also Read : అమెరికా ఎన్నికల్లో 'జై బాలయ్య'.. వైరల్ అవుతున్న బ్యాలెట్ పేపర్ జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి