US Jury : చేయని నేరానికి పదేళ్ల జైలు...రూ. 419 కోట్ల పరిహారం

నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేసి శిక్ష విధించారు.

author-image
By Bhavana
చేయని నేరానికి పదేళ్ల జైలు…రూ. 419 కోట్ల పరిహారం
New Update

US Jury :

నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో ఓ వ్యక్తి. చివరికి అతను ఏ తప్పు చేయలేదని తెలియడంతో కోర్డు అతనిని విడిచిపెట్టింది. అయితే ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జైలు జీవితానికి పరిమితమైనందుకు ఏకంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అమెరికా లోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీని పై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్దారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అతడితో బలవంతంగా నేరాంగీకారం చేయించారిని చెబుతూ 2018 లో బ్రౌన్‌ తరుపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు.

దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే తప్పుడు కేసులో తనను అన్యాయంగా జైల్లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ బ్రౌన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీని పై విచారణ జరిపిన చికాగో ఫెడరల్‌ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కేసులో బ్రౌన్‌ ను అరెస్ట్‌ చేసినందుకు గానూ 10 మిలియన్‌ డాలర్లు, పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గానూ మరో 40 మిలియన్‌ డాలర్లు అతడికి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అంటే మొత్తంగా 50 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.419 కోట్లకు పై మాటే . దానిని పరిహారంగా ఇప్పించింది. కోర్టు తీర్పు పై బ్రౌన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు.

Also Read :  తెలంగాణకు మరో వందే భారత్ రైలు

 

#america #chicago
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe