US Airlines Plane : విమానం ఇంజిన్‌లోకి వెళ్లిన కుందేలు... చెలరేగిన మంటలు.. వీడియో వైరల్!

రన్ వేపై విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు ఇంజన్‌లోకి వెళ్లిన కుందేలు వెళ్లింది. అది గమనించని  పైలట్లు.. విమానాన్ని గాల్లోకి లేపగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్లు.. విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.

New Update
US Airlines Plane

US Airlines Plane

అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. రన్ వేపై విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు ఇంజన్‌లోకి వెళ్లిన కుందేలు వెళ్లింది. అది గమనించని  పైలట్లు.. విమానాన్ని గాల్లోకి లేపగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగడం గుర్తించిన పైలట్లు.. విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.  అమెరికాలోని డెన్వర్ నుండి ఎడ్మింటన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Also read :  ట్రైన్లో నాపై అత్యాచారయత్నం జరిగింది.. బాధితురాలు సంచలన కామెంట్స్!

Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!

ఎడ్మింటన్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌


ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్‌ల ప్రకారంరాత్రి 8:05 గంటల సమయంలో  డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి UA2325 విమానం ఎడ్మింటన్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌ అయ్యింది. అయితే కొద్దిసేపటికే కుడి రెక్క కింద ఉన్న ఇంజిన్‌ నుంచి భారీగా మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. మరికొందరు మాత్రం  వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వెంటనే విమానాన్ని పైలట్లు అత్యవసరం ల్యాండింగ్ చేసి ఆపై వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దింపేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.   ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలో ఎడ్మింటన్ కు పంపారు.

Also read: Rahul Gandhi: రోహిత్ వేముల పేరుతో చట్టం.. CMకు రాహుల్ గాంధీ లేఖ

.

Advertisment
తాజా కథనాలు