Israel: లెబనాన్‌ పై దాడులు 5 రోజుల్లోనే ...90 వేల మంది..!

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో 90 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. తాజా దాడుల్లో 51 మంది మరణించారు.

Iran Attack: ఆ దేశాలకు వెళ్ళకండి.. కేంద్రం హెచ్చరిక
New Update

Israel: హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. లెబనాన్‌ రాజధాని బీరూట్‌ పై క్షిపణులు ప్రయోగించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.

90 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది.లెబనాన్‌ లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ వరుస దాడులతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇజ్రాయెల్‌ వరుస దాడులకు హెజ్‌బొల్లా కూడా ప్రతిస్పందించింది. టెలీ అవీవ్‌ ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో ప్రతిదాడికి దిగింది. 

దీంతో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అటు నుంచి వచ్చిన క్షిపణిని అడ్డుకున్నామని...దానికి సరైన బదులు చెబుతామని ఐడీఎఫ్‌ పేర్కొంది. కాగా..ఇటీవల లెబనాన్‌ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత బీరూట్‌ పై ఇజ్రాయెల్‌ క్షిపణులు ప్రయోగించింది.

అంతేకాకుండా హెజ్‌బొల్లా అగ్రశేణి కమాండర్ల మరణంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. 

ఇదిలా ఉంటే లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ మరోసారి బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో 51 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో 223 మంది తీవ్ర గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. 

Also Read: మహాలక్ష్మి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని హత్య–తరువాత ఆత్మహత్య

 

#israel-hezbollah #israel-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe