Antonio Guterres: ప్రపంచవ్వాప్తంగా ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తి పెరిగిపోతుండటంపై ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మందుపాతరల వినియోగం పెరగటం మానవాళి భాగీ నష్టపోతుందని, వీలైనంత త్వరగా యాంటీపర్సనల్ ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తి, వినియోగం నిలిపేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంబోడియాలో సోమవారం జరిగిన సదస్సులో ఒట్టావా అగ్రిమెంట్ అమలు చేయని కొన్ని దేశాల వల్ల మరింత ముప్పు పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా గతేడాది మందుపాతరల వల్లే ప్రపంచవ్యాప్తంగా 5757 మంది చనిపోయినట్లు ‘ల్యాండ్‌మైన్ మానిటర్’ నివేదిక పేర్కొంది.
తర్వాతి తరాలకు భయాందోళన..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ల్యాండ్ మైన్ భారీగా వినియోగిస్తున్నారు. పుతిన్ సైన్యం వీటిని భారీగా ఉపయోగిస్తుండగా ఉక్రెయిన్‌కు యాంటీపర్సనల్ ల్యాండ్‌మైన్స్‌ను ఇవ్వాలని అమెరికా నిర్ణచడం దారుణం. వీటిద్వారా పౌరులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఘర్షణలు ముగిసినప్పటికీ ఈ ఆయుధాల ముప్పు తర్వాతి తరాలను భయాందోళనలకు గురిచేస్తాయి. రష్యా, మయన్మార్, ఇరాన్, ఉత్తర కొరియా దేశాల్లో మందుపాతరల వినియోగం కొనసాగుతోంది. వీటితోపాటు కాంబోడియా, భారత్, మయన్మార్, పాకిస్థాన్, గాజాలోనూ వీటిని వినియోగించడం ఆందోళన కలిగించే అశంమని గుటెరస్ అన్నారు.