Ukraine: వెంటాడి వేటాడిన కీవ్ డ్రోన్స్..పరుగులు పెట్టిన కిమ్ సైనికులు

ఉక్రెయిన్ దెబ్బకు కిమ్ సైనికులు పరుగులు తీస్తున్నారు. కీవ్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కోలేక వారు పారిపోతున్నారు. తాజాగా వీటికి సంబంధించిన వీడియో ఒక బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 

New Update
Force

Kim Force Photograph: (Google)

దాదాపు రెండేళ్ళుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ జరుగుతోంది. ఉక్రెయిన్‌ను కలుపుకునేంత వరకూ యుద్ధాన్ని ఆపేది లేదని రష్యా చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తలవొగ్గమని ఉక్రెయిన్ అంటోంది. ఇద్దరూ పట్టుదలగా యుద్ధం చేసతున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటూ నాటో దేశాలన్నీ సహాయంగా నిలిచాయి. మరోవైపు ఈ మధ్యనే రష్యా సైన్యంలోకి ఉత్తర కొరియా సైన్యం వచ్చి చేరింది. అయితే ఈ పోరులో కిమ్ సైనికులు విపరీతంగా గాయపడుతున్నారు. యుద్ధం చేయలేక పారిపోతున్నారు. ఉత్తర కొరియా సైనికులు భారీ సంఖ్యలో మరణించడం లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు కూడా. ఇప్పుడు దీనికి సంబంధించి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లకు భయపడి ఉత్తర కొరియా సైనికులు పారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. 

పారిపోతున్న కిమ్ సైనికులు..

ఈ వీడియోను కీవ్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్సెస్‌ ఈ విడుదల చేసినట్లు సమాచారం. రష్యా లోని కుర్స్క్‌ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా జవాన్లను ఉక్రెయిన్‌ బలగాలు కేమికేజ్ డ్రోన్లు వేటాడాయి. గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్‌ సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ఫోర్స్ చెబుతోంది. అయితే, దీనిపై అటు రష్యా గానీ..ఇటు ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ ఇంతవరకూ స్పందించలేదు.

ఉక్రెయిన్ దాడిని అడ్డుకునేందుకు ఇరుదేశాల సరిహద్దు ప్రాంతమైన కుర్క్స్ లో రష్యా భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. ఇందులో భాగంగా మూడు గ్రామాల్లో దాదాపు 10వేల మంది కిమ్‌ సైనికులు పోరాడుతున్నారు. వీరికి రష్యా ముందుగానే చాలా శిక్షణ ఇప్పించింది. కానీ మాస్కో, ఉత్తర కొరియా సైనికులు మధ్య సమన్వయం లేదని...దానివల్లనే ఇబ్బందులు వస్తున్నాయని కథనాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోల్లో కమ్ సైనికులు పారిపోతూ కనిపించారు. 

Also Read: HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు