చైనాలో బేబింకా తుఫాను బీభత్సం

పక్క దేశం చైనాను బెబింకా తుఫాను వణికిస్తోంది. 70 ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఈ టైఫూన్ విజృంభిస్తోంది. గంటకు 151 కి.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘై ను చుట్టుముట్టింది. చాలా అరుదుగా ఈ నగరాన్ని తుఫాన్లు తాకుతాయని స్థానిక మీడియా తెలిపింది.

china
New Update

చైనా ఆర్ధిక నగరం షాంఘైకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నగరానికి తుఫాన్ల బెడద తక్కువ. చాలా అంటే చాలా తక్కువగా ఇక్కడ తుఫాన్లు వస్తాయి. ఎప్పుడైనా వస్తే మాత్రం అది చాలా పెద్ద వార్తే అవుతుంది. ఇప్పుడు షాంఘై ను బెబింకా అనే టైఫూన్ వణికిస్తోంది. గంటకు 151 కి.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘైను తాకింది. 70 ఏళ్ళల్లో ఇంతటి తుపాన్‌ను ఈ ఆర్ధిక నగరం చూడలేదని స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెబింకా కారణంగా అక్కడ విపరీతమైన వర్షం కురుస్తోంది. అక్కడ ఉన్న రెండు వినాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వందల విమానాలు రద్దయ్యాయి. అలాగే రైళ్ళను కూడా నిలిపేశారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు.

చైనాను వరుస తుఫానులు ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్‌గానే ఆ దేశం యాగీ తుఫాను బారిన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలిగింది. నిత్యావసర వస్తువులుకూడా కొనుక్కోలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మరో తుఫాను వారిని ముంచేస్తోంది.

 

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe