China Dangerous Fungus: మరో డేంజరస్ వ్యాధిని పుట్టించిన చైనా.. అమెరికాపై ప్రయోగం

చైనా ల్యాబ్‌ నుంచి మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్‌ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు.

New Update
fungus into the US

నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వ్యాపించిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. మానవ మనుగడనే ప్రమాదంలోకి నెట్టింది. చైనా ల్యాబ్‌ నుంచి మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్‌ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫంగస్ తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో FBI అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చైనా, అమెరికాల మధ్య ముదురుతున్న విభేదాల కారనంగా అమెరికాను దెబ్బ తీసే కుట్ర అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది బయోలాజికల్ వార్ అని అమెరికా ఆరోపిస్తోంది.

ఈ ఫంగస్ కారణంగా మానవులకు, పశువులకు హాని కలుగుతుంది. వాంతులు, కాలేయాన్ని దెబ్బ తీస్తోందని అమెరికా వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ శీలింధ్రాలు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు