Plane Crash: లైవ్ వీడియో.. విమానం కూలి 20 మంది మృతి

టర్కీ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ మిలిటరీ కార్గో విమానం నేలకూలింది. జార్జియాలోని కఖేటి ప్రాంతంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న 20 మంది టర్కిష్ సైనిక సిబ్బంది మరణించారు.

New Update
Turkish plane crashed

Turkish plane crashed

టర్కీ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ మిలిటరీ కార్గో విమానం నేలకూలింది. జార్జియాలోని కఖేటి ప్రాంతంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న 20 మంది టర్కిష్ సైనిక సిబ్బంది మరణించారు. ఇదే విషయాన్ని టర్కీ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  

Turkish plane crashed

టర్కీ రక్షణ మంత్రిత్వ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. తమ వైమానిక దళానికి చెందిన C 130 మిలిటరీ కార్గో విమానం అజర్‌బైజాన్‌లోని గంజా ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి టర్కీకి తిరిగి వస్తుండగా.. జార్జియా-అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని సిఘ్నాఘి మునిసిపాలిటీ (పర్వత ప్రాంతం) వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో సహా 20 మంది సైనిక సిబ్బంది మరణించారు అని తెలిపింది. 

ఈ ఘటనపై రక్షణ మంత్రి గులర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘మా శూరులైన సహచరులు అమరులయ్యారు’’ అని ప్రకటించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సైతం సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే సమయంలో అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కూడా స్పందించారు. ఈ కష్ట సమయంలో తాము టర్కీకి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విమానం కూలిపోవడానికి గల అసలైన కారణాలు ఏంటి?.. ఏ లోపం కారణంగా విమానం కూలిపోయింది?.. ఇది లోపం కారణంగా జరిగిందా? లేక మరేదైన విషయం దాగిఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విమానం గాల్లో పొగలు చిమ్ముతూ కిందకి పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Advertisment
తాజా కథనాలు