తాను అధ్యక్షుడు అయ్యాక ఆర్ధిక విధానాలను మారుస్తానని ట్రంప్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం దిగువలో ఉన్న అమెరికా ఆర్ధిక పరిస్థితి బాగుపడాలంటే...స్ట్రిక్ట్‌గా ఉండక తప్పదని ట్రంప్ అంటున్నారు. తాను పదవిలోకి వచ్చాక ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. జనవరి 20వ తేదీన నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా.. మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధిస్తానని.. చైనా నుంచి వచ్చే వస్తువులపైన కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించుకున్నట్లు రాశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నాని ట్రంప్ చెప్పారు. దీనిపై చైనా కూడా రియాక్ట్ అయింది. అమెరికా- చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఇరుదేశాలకు పరస్పరం మేలు చేస్తాయని మేం విశ్వస్తున్నాం. వాణిజ్య యుద్ధానికి దిగితే మాత్రం ఎవరికీ ఉపయోగం ఉండదు అంటూ అమెరికాలోని చైనా రాయబారి లియు పెంగ్యూ అన్నారు.
ఫెంటనిల్‌పై బ్యాన్..
అయితే చైనా నుంచి వచ్చే ఫెంటనిల్ అనే డ్రగ్ మీద మాత్రం ట్రంప్ గట్టి చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణి.. హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తిమంతమైందని నిపుణులు చెబుతున్నారు. రెండు మిల్లీ గ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బానిసలుగా మారినవారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి వాడుతున్నట్లు తెలుస్తోంది. దీని వలన చాలా మంది అమెరికాలో ప్రాణాలు పోయారు. ఇది చైనా నుంచి వస్తోందని అమెరికా అంటోంది. ముఖ్యంగా ఇది మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్‌ల చేతిలో పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చైనాలో చాలా చౌకగా దీనిని తయారుచేసి వివిధ మార్గాల్లో అమెరికాకు తరలిస్తుందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వాటి మీదనే సుంకాలు విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంతకు ముందు చైనాతో తాను చర్చలు జరిపినట్లు పోస్టులో ట్రంప్ చెప్పారు. అయితే వాటివల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. అందుకే ఆ దేశం వాటిని ఆపేవరకు అక్కడినుంచి వచ్చే ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తామని తెలిపారు.
Also Read: అఖిల్‌కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. YS జగన్ ఫ్యామిలీకి క్లోజ్!