ఆసక్తిగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఇరు అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోటీ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పది రోజు గడువు మాత్రమే ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. ఇద్దరులో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమేనని అంటున్నాయి సర్వేలు.

author-image
By Manogna alamuru
New Update

US Elections: 


అమెరికా అధ్యక్ష ఎన్నికలు...ప్రపంచమంతా ఆసక్తిగా చూసే ఎన్నికల్లో ఇవి ఒకటి. ఇక్కడ కేవలం రెండు పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. ఒకటి రిపబ్లికన్, రెండు డెమోక్రటిక్. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్ తరుఫు నుంచి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్స్ తరుఫు నుంచి కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా పోటీ ఇప్పుడు ఆసక్తి కరంగా ఉంది. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది. 

ఎన్నికల కోసం ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులూ విపరీతంగా ప్రచారం చేశారు. అమెరికన్ ప్రజల నుంచి ఇద్దరు అధ్యక్ష అభ్యర్ధులకూ మద్దతు సమానంగా లభించింది. లేటుగా పోటీలోకి వచ్చిన డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ చాలా తొందరగానే ప్రజల దగ్గర మద్దతు సొంతం చేసుకున్నారు. డిబేట్లలోనూ ట్రంప్, కమలాలు నువ్వా నేనా అన్నట్టు మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్యనా చాలా టఫ్ పోటీ నెలకొంది. ఈ కారణంగా సర్వేల్లో ఇద్దరికి వచ్చే ఓట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు. దాంతో ఈ అధ్యక్ష ఎన్నిక పీఠంపై కూర్చునేదెవరో అంచనావేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అరిజోనా, మిషిగన్, జార్జియాలో కమల హారిస్ ముందంజలో ఉండగా.. నెవెడా, పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించారు. నార్త్ కరొలైనా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక స్వింగ్ స్టేట్ విషయానికి వస్తే...అరిజోనా, నెవెడా,విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలను స్వింగ్ టేట్స్ అంటారు. ఇక్కడ ఓటర్ల నిర్ణయం బట్టి అధ్యక్షుడు ఎవరన్నది తేలుతుంది. ముఖ్యంగా పెన్సిల్వేనియాలో. ఈసారి ఎన్నికల్లో  పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్లకు మద్దతు కొంచెం ఎక్కువగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్లో 47 శాతంతో ముందు ఉండగా, కమలా హారిస్ 45 శాతంలో ఉన్నారు. ఇక నెవడాలో మాత్రం హారిస్‌ గెలిచే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రంప్‌కి 47 శాతం ఉండగా, కమలా హారిస్‌కి 48 శాతం మద్దతు ఉంది. మిచిగాన్, విస్కాన్సిన్ లలో ఇద్దరిక 49 శాతం మద్దతు ఉంది. ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ సర్వే ప్రకారం.. హారిస్‌కి ఆసియన్లు, యూత్‌లో ప్రజాదరణ ఉండగా, మిగతా వర్గాలు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ ప్రకారం.. ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఆరింటిలో ఇద్దరు రెండు శాతం పాయింట్ల తేడాలో ఉన్నట్లు చెప్పింది. అరిజోనా, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ ఆధిక్యంలో ఉండగా.. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో ట్రంప్ ముందున్నారు. 

భారత ఓటర్లు...

ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారనే చెప్పాలి. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఇక్కడకు వచ్చిన సెటిల్ అయినవారే కాకుండా..గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉంది. భారతీయులకు ట్రంప్‌తో ఇంతకు ముందే అనుభవం ఉంది. లాస్ట్ టైమ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భాతీయులు నానా కష్టాలు పడ్డారు. వీసాల జారీను చాలా కట్టుదిట్టం చేసేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి కూడా ట్రంపం ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కఠినంగానే ఉంటారని చెబుతున్నారు. వీసాలను కూడా ఎక్కువ ఇవ్వకపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ట్రంప్ విజయం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. రిపబ్లికన్‌ పార్టీ కనుక విజయం సాధిస్తే...ఇంతకు ముందులానే వీసాల ప్రాబ్లెమ్ మళ్ళీ షురూ అవుతుందని చెబుతున్నారు.  వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని.. ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయని అంటున్నారు. దీంతో అమెరికన్ కంపెనీలు...ఇండియా నుంచి ఉద్యోగులను తెప్పించుకోవడం మానేస్తాయని..స్థానికులనే నియమించుకుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికన్ మార్కెట్‌లో భారత ఉద్యోగులకు డిమాండ్ తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత కంపెనీలు చాలా మట్టుకు ఆన్‌సైట్ కు ప్రోత్సహించడం లేదు. ఇప్పుడు వీసాలను టైట్ చేసేస్తే...ఆ ఉన్న ఛాన్స్ కాస్తా మరింత తగ్గిపోతుంది. 

అయితే ఈ విషయంలో కలా హారిస్‌కు భారతీయుల నుంచి మద్దతు బాగానే ఉంది. స్వతహాగా ఆమె ఇండియన్ ఆరిజీన్ కలిగి ఉండడం...కమలాకు ప్ల్ పాయింట్‌గా మారనుంది. అదీ కాక ఇమ్మిగ్రెంట్స్ విషయంలో సానుకూలంగా ఉంటానని కమలా చెబుతున్నారు. ఇది కూడా ఆమెకు కలిసి వచ్చే అంశం. అయితే ప్రస్తుతం అమెరికా ఆర్ధిక పరిస్థితి అంత ఏమీ గొప్పగా లేదు. దానికి తోడు ఇరాన్, ఇజ్రాయెల్...రష్యా‌‌ఉక్రెయిన్ యుద్ధాలు నెత్తిమీద ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్‌కు డైరెక్ట్‌గానే సపోర్ట్ చేస్తోంది. ఆయుధాలు, సైన్యం సమకూరుస్తోంది. ఇప్పుడు  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యతను తీసుకుంటున్నాయి. వీటి మీద కూడా ఆధారపడి ఓట్లు పడతాయని భావితున్నారు. ఆర్ధక పరిస్థితి, యుద్ధం...ఈరెండు విషయాల్లో అమెరికన్లు, కొంత భారతీయులు కూడా ట్రంప్ వైపునే మొగ్గుతున్నారు. ఆయన అయితేనే ఈ రెండింటినీ బాగా డీల్ చేయగలరని చెబుతున్నారు. బైడెన్ నేతృత్వంతో డెమోక్రటిక్ పార్టీ గత నాలుగేళ్ళల్లో తీసకున్న నిర్ణయాలు అమెరికన్లను ఏమీ అంతగా సంతృప్తి పరచలేదు. కాబట్టి ఇప్పుడు కమలా హారిస్ వచ్చినా కూడా పెద్దగా పరిస్థితిలో మార్పు ఉండదని అంటున్నారు. దీంతో పాటూ టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో భారతీయులుకూడా ట్రంప్‌కు విపరీంగా మద్దతు పలుకుతున్నారు.సనాతన ధర్మం, జాతీయత లాంటివి కాపాడుకోవాలి అంటే ట్రంప్‌ కు ఓటేయండి అంటూ ప్రచారాలు కూడా చేస్తున్నారు. డాలస్ లాంటి ప్లేస్‌ లలో భారతీయ భాషల్లో బోర్డులు, బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. అమెరికన్లనకు కూడా ట్రంప పట్ల ఇదే భావం ఉన్నట్టు కనిపిస్తోంది. 

ఈ కారణాలే ట్రంప్‌కు కాస్త ఆధిక్యం తెచ్చిపెడతాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఓట్ల తేడా మాత్రం చాలా తక్కువగానే ఉండనుంది. ట్రంప్, కమలా హారిస్ ఇద్దరిలో ఎవరు గెలిచినా చాలా కొద్దిగా అంటే...కేవలం ఒకటి, రెండు శాతాల ఆధిక్యంలోనే విజయం సాధిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read: Israel: ఇజ్రాయెల్ దగ్గర అతి పెద్ద బాంబ్..వణుకుతున్న ఇరాన్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe