/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యార్క్ కౌంటీలోని కోడొరస్ టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది.ఈ కాల్పుల్లో ఒక దుండగుడిని కూడా పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటన 2 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదుపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒక వ్యక్తి పోలీసులపై కాల్పులు జరపడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. గాయపడిన పోలీసుల పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని స్థానిక అధికారులు తెలిపారు.