New USA President Donald Trump:
అంచనాలకు విరుద్ధంగా ట్రంప్ విజయదుదుభి మోగించారు. గ్యాప్ తర్వాత మళ్ళీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఎవరు ఏం చెప్పినా...గాలి ఎంత బ్లూ వాల్ వైఉ వీచినా...ట్రంప్ మాత్రం విజయం తనదే అని నమ్మకంగా చెబుతూ వచ్చారు. చివరకు అదే నిజమని ప్రూవ్ కూడా అయింది. ట్రంప్ విజయానికి కారణాలేంటి? ఎందుకు ఈసారి అమెరికన్లు డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు అని పరిశీస్తే...ఈ కిందివి ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈసారి అమెరికా ఎన్నికలు మొదటి నుంచీ అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దానికి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉండడమే. దానికి తోడు అమెరికాలోని పరిస్థితులు తడయ్యాయి. ప్రస్తుతం అమెరికా ప్రజలు ప్రజాస్వామ్యం కన్నా తమ దేశం ఆర్ధికంగా సురక్షితంగా ఉండడమే ముఖ్యమని భావించారు. గత నాలుగేళ్ళల్లో బైడెన్ ప్రభుత్వం సారథ్యంలో అమెరికా ఆర్ధిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. అసలు చాలా ఏళ్ళుగా ప్రపంచ పెద్దన్న పైకి బాగానే కనిపిస్తున్నా..లోపల ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. దీనిని సరిచేయాలంటే ప్రజాస్వామ్యానికి విలువిచ్చే డెమోక్రాట్ల కంటే..ట్రంప్ లాంటి వ్యాపారవేత్తలే కరెక్ట్ అనుకున్నారు అమెరికన్లు. అందుకే ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు.
ఆర్ధిక వ్యవస్థ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉంది. చాలామంది అమెరికన్లు అధిక ధరలతో సతమతమయ్యారు. నాలుగింట ఒకవంతు అమెరికన్లు మాత్రమే దేశ ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తిగా ఉన్నారు. మూడింట రెండొంతుల మంది ఆర్థిక రంగంపై విమర్శు చేశారు. ఆర్థిక వ్యవస్థ అంశంలో బైడెన్ ప్రభుత్వంపై అమెరికన్లలో చాలానే వ్యతిరేకత ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం రేటింగ్ జాతీయ స్థాయిలో పడిపోయింది. 10 మంది ఓటర్లలో నలుగురు మాత్రమే ఆయన పనితీరును ఆమోదించారు. ఇది ట్రంప్‌కు కొంత అనుకూలంగా మారింది. ఎన్నికల ప్రచారంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థలో సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మీరు మెరుగ్గా ఉన్నారా అంటూ ఓటర్లను ట్రంప్ సూటిగా ప్రశ్నించారు. దిగుమతులపై సుంకాల అంశంలో ట్రంప్‌వైపే ఓటర్లు మెుగ్గు చూపారు.
వలసల విధానం..
వలస విధానం విషయంలో ట్రంప్‌పై అమెరికన్లు పాజిటివ్ గా ఉన్నారు. ఆయన వలస సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరని మెజారిటీ ఓటర్లు బలంగా నమ్మారు. తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపుతానని ట్రంప్‌ప్రకటించడం ఆయనకు పనికి వచ్చింది. మొత్తం వలస విధానాన్నే మారుస్తానని ట్రంప్ పలు ప్రచారాల్లో తేల్చి చెప్పడం..అమెరికన్లను ఆకట్టుకుంది. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారికి జన్మించిన పిల్లలకు సిటిజెన్ షిప్ ఇవ్వనని ట్రంప్ కచ్చితంగా చెప్పేశారు. అలాగే శరణార్థి విధానాలనూ సమీక్షిస్తానని చెప్పడం వంటివి ఓటర్లను ఆకర్షించాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ డిపోర్టేషన్ చేపడతానన్న ట్రంప్ తన మాట మీద ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడతానని మాట ఇచ్చారు. అటు బైడెన్ హయాంలో సరిహద్దుల్లో అక్రమ వలసలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విషయంలో ఓటర్లు ట్రంప్‌నే ఎక్కువగా నమ్మారు.
ముస్లిం ఓటర్లు...
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో బైడెన్ ప్రభుత్వ విధానాల వల్ల అమెరికాలోని ముస్లిం ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది ట్రంప్‌కు బలంగా మారింది. ఇజ్రాయెల్ విషయంలో బైడెన్-హారిస్ ద్వయం విధానాల మూలంగా 40వేల మంది పాలస్తీనీయులు హతమయ్యారని అమెరికాలో స్థిరపడిన ముస్లిమ్‌లు భావించారు. క్రితం సారి వరకు అమెరికాలో ప్రవాసులు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో సాధారణంగా ప్రవాసులంతా డెమోక్రటిక్ పార్టీకి ఓటు వేసేవారే కానీ..గత ప్రభుత్వం పశ్చిమాసియాలో అనుసరించిన విధానాల కారణంగా ప్రవాస అరబ్బులకు వారిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది ట్రంప్‌కు లాభం చేకూర్చింది. అమెరికా తలరాతను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన మిషిగన్‌లో అధికసంఖ్యలో అమెరికన్ ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరే ఓట్లే మిషిగన్‌లో ట్రంప్‌నకు విజయాన్ని కట్టబెట్టాయి. అరబ్, ఇజ్రాయెల్ పరిణామాలు పెన్సిల్వేనియాలోనూ ప్రభావం చూపాయి. అక్కడ ట్రంప్ వైపే ఓటర్లు మొగ్గుచూపారు.
మీడియా...
ట్రంప్ గెలవడానికి మీడియా కూడా ఒక రకంగా కారణమైంది. ట్రంప్ ఒక రకంగా ఫ్రీగా ఉండే నేత. ఎప్పుడూ జోవియల్‌గా ఉంటూనో, ఫన్నీగా గెస్చర్స్ ఇస్తూనో ఉంటారు. అలాగే మాట్లాడతారు కూడా. ఇది మీడియాకు మంచి సరుకు. ట్రంప్ ధ్యక్షుడుగా ఉన్న కాలంలో మీడియా చాలా ఎక్కువగా పని చేసింది. ఇది దానికి ఎంతో ఉయోగపడే పరిణామం. మీడియా ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. లాగే ట్రంప్ అధ్యక్షుడు అయితే కొత్త మీడియా కూడా వస్తుందనే హోప్స్ ఉన్నాయి. ఎలాన్ మస్క్, ఎక్స్ లాంటి సపోర్ట్ ఎలానో ఉంది.