BIG BREAKING  : కొంపముంచిన ఫోన్‌ కాల్‌.. థాయ్‌ ప్రధానిపై వేటు

థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతో పాటుగా ఆమె మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

New Update
pm

థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతో పాటుగా ఆమె మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక లీకైన ఫోన్‌ సంభాషణ కారణంగా ఆమెను పదవి నుండి తొలగించారు. ఈ సంభాషణలో ఆమె పొరుగు దేశమైన కంబోడియా మాజీ ప్రధానమంత్రి హున్ సేన్‌తో తమ దేశ అంతర్గత పరిస్థితుల గురించి, సైనిక కమాండర్‌తో ఉన్న విభేదాల గురించి మాట్లాడటం వివాదాస్పందంగా మారింది. 

సరిహద్దు వివాదాల కారణంగా

థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా సంబంధాలు అంత మంచివిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో థాయ్‌లాండ్‌ ప్రధాని ఒక విదేశీ నాయకుడితో దేశ అంతర్గత విషయాలను చర్చించడం నైతిక ఉల్లంఘనగా కోర్టు భావించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. దేశ నాయకురాలిగా, ఫోన్ కాల్ కేసులో ఆమె నైతికతకు సంబంధించిన రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని కోర్టు తీర్పులో వెలువరించింది.  

కాగా గతంలో థాయ్‌లాండ్‌ ప్రధానిగా ఉన్న స్రెట్టా థావిసిన్‌ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కారణంగా పదవిని కోల్పోయారు. నేర చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని తన మంత్రివర్గంలో చేర్చుకోవడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు కేసుల్లోనూ రాజ్యాంగ కోర్టులు కీలక పాత్ర పోషించాయి.

Advertisment
తాజా కథనాలు