Russian: చీమ కూడా దూరకుండా పుతిన్ ఇంట్లో సెక్యురిటీ.. ద మస్కెటీర్స్ గురించి తెలిస్తే షాక్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై అటాక్ కలకలం రేపింది. పుతిన్ నివాసం అంటే కేవలం ఓ బిల్డింగ్ కాదు, అదొక శత్రు దుర్భేద్యమైన కోట. అలాంటి కోటనే ఆయన శత్రువులు టార్గెట్‌గా పెట్టుకొని దాడి చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ డ్రోన్‌ను నేలమట్టం చేసింది.

New Update
putin

ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాతో పోటీ పడుతున్న దేశం రష్యా. ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై అటాక్ కలకలం రేపింది. పుతిన్ నివాసం అంటే కేవలం ఓ బిల్డింగ్ కాదు, అదొక శత్రు దుర్భేద్యమైన కోట. ఆయన నివాసాలైన మాస్కో శివార్లలోని నోవో-ఒగారియోవో, సోచిలోని బోచారోవ్ రుచేయ్, అత్యంత రహస్యంగా భావించే వల్దాయ్ ప్యాలెస్‌ల భద్రత ఇంద్రుడి కోటను తలపిస్తుంది.

అలాంటి కోటనే ఆయన శత్రువులు టార్గెట్‌గా పెట్టుకొని దాడి చేశారు. అప్రమత్తంగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెంటనే ఆ డ్రోన్‌ను నేలమట్టం చేసింది. పుతిన్ నివాసంలో సెక్యురిటీ సిస్టమ్ ఎలా ఉంటుందనేది ఎవరు అంచనా వేయలేరు.

రష్యా అధ్యక్షుడి సేఫ్ట్వీ కోసం అక్కడి ప్రభుత్వం ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనే ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. వేల సంఖ్యలో సిబ్బంది, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ వ్యవస్థ పుతిన్‌ను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. పుతిన్ అధికారిక నివాసమైన 'క్రెమ్లిన్' లేదా ఆయన వ్యక్తిగత నివాసాల చుట్టూ భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది.

పుతిన్ నివాసంపై డ్రోన్ లేదా క్షిపణి దాడులు జరగకుండా నిరంతరం S-400 వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలు పహారా కాస్తుంటాయి. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించినప్పుడు, ఈ వ్యవస్థలే వాటిని గాలిలోనే అడ్డుకున్నాయి. ఇంటి చుట్టూ శక్తివంతమైన ఎలక్ట్రానిక్ జామర్లు ఉంటాయి. ఇవి శత్రువుల సిగ్నల్స్‌ను, డ్రోన్ కమ్యూనికేషన్లను అడ్డుకుంటాయి. పుతిన్ పర్సనల్ సెక్కురిటీ 'ద మస్కెటీర్స్' అని పిలుస్తారు. వీరు కఠినమైన ట్రైనింగ్ పొందిన ఎలైట్ ఫోర్స్. ఆయన బాడీగార్డులు ఎప్పుడూ తమ చేతిలో బ్లాక్ బ్రీఫ్‌కేస్‌లను పట్టుకుని ఉంటారు. ఇవి కేవలం ఫైళ్ల కోసం మాత్రమే కాదు, దాడి జరిగినప్పుడు సెకన్ల వ్యవధిలో తెరుచుకుని బుల్లెట్ ప్రూఫ్ కవచాలుగా మారుతాయి.

పుతిన్ తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనకు వడ్డించే ముందు స్పెషల్ ఆఫీసర్ అందులో ఏమైనా పాయిజన్ కలిపారా అని టెస్ట్ చేస్తారు. పుతిన్ ప్రాణాలకు ముప్పు ఉన్నచోట లేదా బహిరంగ సభల్లో ఆయన పోలికలతో ఉండే 'బాడీ డబుల్స్'ను వాడుతుంటారని అంతర్జాతీయ నిఘా వర్గాలు చెబుతుంటాయి. ఆయన వాడే ఆరస్ సెనాట్ కారు ఒక నడిచే యుద్ధనౌక లాంటిది. ఇది బాంబు దాడులను, గ్యాస్ దాడులను కూడా తట్టుకుంటుంది. టైర్లు పేలిపోయినా ఈ కారు వేగంగా ప్రయాణించగలదు. పుతిన్ నివాసం లోపల ఏం జరుగుతుందనేది ప్రపంచానికి ఎప్పుడూ ఒక రహస్యమే.

Advertisment
తాజా కథనాలు