RTV Exclusive: అమెరికాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు-VIDEO

అమెరికా అర్కాన్సాస్‌ రాష్ట్రంలోని బెంటన్‌విల్లేలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ వారితో పాటు.. ఏపీ మహిళలు కూడా కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. అగ్రరాజ్యంలో పువ్వులను పూజించే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు.

New Update

తెలంగాణ వ్యాప్తంగా నిన్న సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ మన వాళ్లు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆర్కాన్సాస్‌ రాష్ట్రంలోని బెంటన్‌విల్లేలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేవలం తెలంగాణ వారే కాకుండే ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డ వారు సైతం పాల్గొని సందడి చేశారు. పూలతో అందమైన బతుకమ్మను పేర్చి.. పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు.

సంతోషంగా ఉంది..

ఈ సందర్భంగా వారితో RTV ముచ్చటించింది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా సొంత ప్రాంతాన్ని మిస్ ప్రాంతాన్ని అవుతున్నామన్న ఫీలింగ్ పోతుందన్నారు. చిన్నప్పుడు తాము ఎంత ఘనంగా ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నామో.. ఇప్పుడు ఈ దేశంలో కూడా అలానే జరుపుకుంటున్నందుకు హ్యాపీగా ఉందన్నారు. తమతో పాటు తమ పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 

#Bathukamma 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe