రష్యా యుద్ధం నుంచి 45 భారతీయ సైనికులకు విముక్తి రష్యా యుద్ధం నేంచి 45 మంది భారతీయ సైనికులను విముక్తి కలిగింది. వీరందరూ త్వరలోనే స్వదేశానికి రానున్నారు. మరో 50 మందికి కూడా యుద్ధభూమి నుంచి విముక్తి చేసే ఏర్పాట్లు చేస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. By Manogna alamuru 12 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రష్యాలో ఉన్న భారతీయులకు నెమ్మదిగా స్వాతంత్ర్యం లభిస్తోంది. రెండేళ్ళుగా రష్యాఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత సైనికులకు ఎట్టకేలకు విముక్తి లభిస్తోంది. తాజాగా 45 మంది సైనికులను యుద్ధం నుంచి విడుదల చేస్తున్నారు. వీరితో పాటూ మరో 50 మందిని కూడా వెనక్కు పంపే ఆలోచనలో ఉన్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రీసెంట్‌గా ప్రధాని మోదీ రషయా పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలూ భారత సైనికుల విషమై ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్యాలో భారత సైనికుల గురించి కొన్ని రోజల క్రితం చాలా కథే బయటడ్డాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేసి సైన్యంలోకి లాక్కున్నారని తెలిసింది. అప్పట్లో నలుగురు భారతీయులు యుద్ధంలో చనిపోయనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత మన విదేశాంగ శాఖ అక్కడి అధికారులతో చర్చలు జరిపి..అప్పుడే కొంతమందిని స్వదేశానికి తీసుకువచ్చింది. ఇప్పుడు మరికొంత మంది వెనక్కు వస్తున్నారు. భారత యువకులను ఎలా అయినా రక్షించాలని భారత నేతలు కోరుకోవడమే దీనికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి