ఉక్రెయిన్‌ విద్యుత్ వ్యవస్థపై రష్యా భీకర దాడులు.. చీకట్లో 73 వేల మంది ప్రజలు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు మరోసారి లక్షలాది మంది పౌరులను అంధకారంలోకి నెట్టాయి. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని మంగళవారం రష్యా భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. పవర్ గ్రిడ్‌లు, విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి.

New Update
Russia Attack on Ukraine power system

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు మరోసారి లక్షలాది మంది పౌరులను అంధకారంలోకి నెట్టాయి. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని మంగళవారం రష్యా భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా దేశంలోని అనేక కీలక పవర్ గ్రిడ్‌లు, విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ విద్యుత్ శాఖ మంత్రి హెర్మన్ హలుష్చెంకో తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలపై దాడులు జరగడంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా కీవ్‌తో సహా సరిహద్దు ప్రాంతాలలో, రివ్నె, వోలిన్ రీజియన్‌లలో వేలాది కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. . రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలైన ల్వీవ్, జాపోరిజియా, ఒడెస్సా సహా సుమారు తొమ్మిది ప్రాంతాల్లోని పౌర నివాసాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో పౌరులు కూడా మరణించగా, పలువురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో రష్యా ఈ తరహా దాడులకు పాల్పడటం ఉక్రెయిన్ పౌరులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. అతిశీతల ఉష్ణోగ్రతల నుండి రక్షణ పొందడానికి అవసరమైన తాగునీరు, ఇళ్లలో హీటర్ల కోసం విద్యుత్ సరఫరా అత్యంత కీలకం. శీతాకాలాన్ని ఆయుధంగా వాడుకుంటూ ప్రజలను తీవ్రంగా వేధించేందుకే రష్యా ఈ దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలను త్వరితగతిన పునరుద్ధరించడానికి, సాధ్యమైనన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అందించడానికి ఇంజినీర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నారు. అయినప్పటికీ, దాడుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పునరుద్ధరణ పనులు సవాలుగా మారాయి. రష్యా దాడులు ఉక్రెయిన్ పౌరుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు