కెనడా పోలీస్,ఆర్మీల్లో ఖలిస్తాన్ వ్యక్తులు..డిప్లమాట్ సంజయ్ వర్మ

 నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో సీనియర్ దౌత్యవేత్త సంజయ్ వర్మను చేర్చించింది కెడా ప్రభుత్వం. అంతేకాదు దేశం నుంచి వారిని వెళ్ళిపోవాలని కూడా చెప్పింది. దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన..సంచలన విషయాలను బయటపెట్టారు. 

11
New Update

Senior Diplomat Sanjay Varma: 

కెనడా, భారత్‌ల మధ్య దౌత్యపరమైన వివాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్‌ను అనుమానిస్తూనే ఉంది కెనడా ప్రభుత్వం. తాజాగా అక్కడ మన దౌత్యవేత్తలను  కెనడా వదిలి వెళ్ళిపోవాలని చెప్పింది. మరి కొంతమందిని మన ప్రభుత్వం రీకాల్ చేసింది. ముఖ్యంగా సీనియర్ దౌత్యాధికారి సంజయ్ వర్మ ను నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో చేర్చడంతో పెద్ద గొడవే అయింది. ఈ విషయంలో కెనడా ప్రధాని ట్రూడో స్వంత, ప్రతిపక్ష పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కూడా. 

ఇది కూడా చూడండి:Blink it:  బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే

ఇక తాజాగా ఇండియా వచ్చిన డిప్లమాట్ సంజయ్ వర్మ సంచలన విషయాలు చెప్పారు. కెనడా పోలీసులు, ఆర్మీలో ఖలిస్తాన్ అనుకూలించే విధానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కెనెడియన్ పార్లమెంట్‌లో కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారని ఆయన చెప్పారు.  పీఎం జస్టిన్ ట్రూడో ప్రజామోదం పడిపోయిందని...సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందని చెప్పారు. ట్రూడో ప్రభుత్వంలో చాలా మంది భారత వ్యతిరేకులే అని అన్నారు. అంతేకాదు కెనడాలో భారత విద్యార్ధులను కూడా ఖలిస్తానీ శక్తులు ప్రబావితం చేస్తున్నాయని చెప్పారు సంజయ్ వర్మ. విద్యార్థులను ఉగ్రవాదులుగా రాడికలైజ్ చేయడానికి చూస్తున్నారని అన్నారు. కెనడాలోని విద్యార్థుల తల్లిదండ్రులు వారితో క్రమం తప్పుకుండా మాట్లాడాలని, వారి పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. కెనడాలో జాబ్స్, డబ్బుతో మన స్టూడెంట్స్‌కి ఎర వేస్తూ దాని ద్వారా ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారని సంజయ్ వర్మ ఆరోపించారు.  కొందరు స్టూడెంట్స్ కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ముందు స్వదేశానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం, నినాదాలు చేసేలా చేయడమే దీనికి నిదర్శనమని ఆయన అంటున్నారు. ఇలా చేస్తే కెనడాలో సెటిల్ అయిపోవచ్చనే ఆశతో విద్యార్ధులు ఉంటున్నారని అంటున్నారు సంజయ్ వర్మ.

ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!

ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!

ఇది కూడా చూడండి: Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe