ఫిలిప్పీన్స్‌లో ట్రామీ తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరగడంతో దాదాపుగా 130 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా నీట మునిగాయి. పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణాకి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వర్షాల కారణంగా వరదలకు కొట్టుకుపోయే వారు కొందరు అయితే, విద్యుత్ షాక్ తగిలి కొందరు మరణించారు.
ఇది కూడా చూడండి: ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి!
రెండు నెలల్లో కురవాల్సిన వర్షం..
ఈ ఏడాది మొత్తం మీద ఫిలిప్పీన్స్‌లో వచ్చిన తుపానులో ఇదే విధ్వంసం సృష్టించింది. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం అంతా కూడా కేవలం ఒక రోజులోనే కురిసింది. వరదల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం ఎక్కడ ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్నారు.
ఇది కూడా చూడండి: ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం..మార్కెట్లోకి స్విగ్గీ ఐపీఓ ఎంట్రీ?
ఈ వరదల్లో ఎందరో కూడా గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ వరదల్లో చిక్కుకున్నాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి వాతావరణ విపత్తులను పరిష్కరించేందుకు వరద నియంత్రిత ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ దేశ అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రామీ తుఫాను వల్ల 50 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారని.. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.
ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...!
వరదల ప్రభావం వల్ల ఫిలిప్ఫిన్స్‌లో శుక్రవారం పాఠశాలలు, కార్యాలయాలు మూసేశారు. శనివారం కాస్త వాతావరణం అనుకూలించడంతో అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా.. పసిఫిక్ మహాసముద్రం, సౌత్ చైనా సముద్రం మధ్య ఫిలిప్ఫిన్స్ ఉంటుంది. ప్రతీ ఏడాది అక్కడ దాదాపు 20 తుపానులు వస్తుంటాయి. 2013లో సంభవించిన హయాన్ అనే తుఫాను వల్ల 7300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చూడండి: Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే!