Earthquake: మరోసారి భూకంపం.. ప్రాణాల గుప్పెట్లో ప్రజలు పరుగులు

ఫిలిప్పీన్స్‌లోని లూజోన్ ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని మనీలాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

New Update
Earthquake

Earthquake

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాతో సహా లూజోన్ ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం 192 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Earthquake Philippines

ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం గాని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం గాని జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. అయినప్పటికీ భూకంపం సంభవించినప్పుడు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఫిలిప్పీన్స్ తరచుగా భూకంపాలు సంభవించే ‘‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’ లో భాగంగా ఉంటుంది. దీంతో ఇక్కడ భూకంపాలు సాధారణం. స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు