/rtv/media/media_files/2025/06/04/4JfpUrWzgty0CXO1lCM1.jpg)
sana yousaf shot dead
Pakistan: పాకిస్థాన్‌లో ప్రతి సంవత్సరం ఎంతో మంది మహిళలు తమ స్వేచ్ఛాయుత నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మత చట్టాలు, పరువు, సంప్రదాయాల పేరుతో మహిళల ప్రాణాలు తీస్తున్నారు కొందరు దుర్మార్గులు. చేతిలో మొబైల్ పట్టుకున్న, నవ్వుతూ వీడియోలు తీసుకున్నా 'అసభ్యం' అంటారు. కాస్త ధైర్యంతో సోషల్ మీడియాలో తమ భావాలను, నిర్ణయాలను బయటపెడితే కాల్చి చంపుతున్నారు.
సనా యూసఫ్ దారుణ హత్య
ఇప్పుడు, 17 ఏళ్ల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసఫ్ ఈ దారుణ ఆచారానికి బలైనట్లు తెలుస్తోంది. ఈ దారుణం నాటి మలలా కథను గుర్తుచేస్తోంది. అప్పుడు మలాలా ప్రాణాలతో బయటపడింది.. కానీ ఇప్పటి సనా మాత్రం మత పిచ్చికి బలైంది. సోషల్ మీడియాలో సనా కార్యకలాపాలు, జీవనశైలే ఆమె హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సనా యూసఫ్ ను ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో ఓ దుండగుడు కాల్చి చంపడం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ఈ సనా యూసఫ్ ఎవరు? సోషల్ మీడియాలో ఆమె ఏం చేస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
/rtv/media/media_files/2025/06/04/egbBEoRIP6YxB4iSChj4.png)
సనా యూసఫ్ ఎవరు?
సనా యూసఫ్, పాకిస్థానీ ఇస్లామాబాద్‌లో జన్మించింది. 17 ఏళ్ళ వయసున్న సనా తన వీడియోలతో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యింది. ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.
సనా తన వీడియోలలో చిట్రాలీ సంస్కృతిని (వారి సాంప్రదాయ దుస్తులు, పాటలు, నృత్యాలు), మహిళల హక్కులను, బాలికల విద్యను ప్రోత్సహించేది. ఈ క్రమంలో జూన్ ఆమె జూన్ 1, 2025న ఆమె తన పుట్టినరోజున ఇస్లామాబాద్‌లోని తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది.
/rtv/media/media_files/2025/06/04/mE9zgQoCNsbZM7LbsIw1.png)
అయితే పోలీసులు ఈ కేసును 'పరువు హత్య' కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సనా కార్యకలాపాలు, ఆమె జీవనశైలి కారణంగా సమాజంలోని కొన్ని వర్గాల నుంచి ఆమెపై వ్యతిరేకత వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని (ఓమర్ హయత్ అనే 22 ఏళ్ల వ్యక్తి) అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతను నేరం అంగీకరించాడని కూడా తెలుస్తోంది. అయితే కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
Also Read: Prashanth Neel: RCB విజయంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్.. ఎన్టీఆర్ సెట్లో సంబరాలు! (వీడియో)