Pakistan : పాకిస్తాన్ వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో హింస ఆగడం లేదు. గుర్తు తెలియని దుండగులు ప్రయాణికుల వాహనం పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రంగా గాయాపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కుర్రం జిల్లాలోని కంజ్ అలిజాయి ప్రాంతంలో ముష్కరులు ప్రయాణీకుల వాహనంపై మెరుపుదాడి చేశారని కుర్రం డిప్యూటీ కమిషనర్ (డీసీ) జావిదుల్లా మెహసూద్ చెప్పారు.
దాడి చేసిన వ్యక్తులు వాహనంపై కాల్పులు జరిపారు. 11 మంది ప్రయాణికులు మరణించారు. ఒక మహిళతో సహా మరో ఆరుగురు గాయపడ్డారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆయన చెప్పారు.
అయితే ఇప్పటి వరకు హత్యలకు ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదని చెప్పారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని కుర్రం జిల్లా కుంజ్ అలీజాయ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆసుపత్రి, స్థానిక అధికారులు తెలిపారు. పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని కుంజ్ అలీజాయ్ పర్వతాలు, అక్కడి రోడ్లపై కాల్పులు జరిగినట్లు కుర్రం డిప్యూటీ కమిషనర్ (డీసీ) తెలిపారు.
Also Read : బాబా సిద్ధిఖీ హత్యకు కారణం.. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత్యమేనా?