మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. గత ఆదివారం ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. గెరెరో గవర్నర్ ఎవెలిన్ సల్గాడో సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. మొత్తం గెరెరో కమ్యూనిటీ అతని మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ యువ మేయర్ శిరచ్ఛేదం జరిగింది. పికప్ ట్రక్కుపై అతని తల చిత్రాలు వాట్సాప్‌లో వైరల్ గా మారాయి. ఓ నివేదిక ప్రకారం, డ్రగ్ కార్టెల్ ఈ నగరంలో చాలా హింసాత్మకంగా ఉందని సోషల్ మీడియా X లో పేర్కొంది. గెర్రెరో ప్రజలు భయంతో కూడిన వాతావరణంలో జీవించవలసి వస్తుంది. ఇటీవలి నెలల్లో గెర్రెరో రాజకీయ నాయకులు, పాత్రికేయులకు చాలా ప్రమాదకరమని ఈ హత్యతో నిరూపితమైంది.
నగరంలో డ్రగ్స్ కార్టెల్స్ వ్యాప్తి చేస్తున్న హింసకు అందరూ భయపడుతున్నారు. జూన్ 2న జరిగిన ఎన్నికలకు ముందు మెక్సికోలో ఆరుగురు రాజకీయ అభ్యర్థులు చనిపోయారు.
Also Read : జమ్మూకశ్మీర్‌లో స్వతంత్ర అభ్యర్థుల జోరు