Earthquake In Indonesia: వణుకు పుట్టించిన భారీ భూకంపం.. ప్రజలు పరుగో పరుగు

ఇండోనేషియాలో ఇవాళ 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తనింబర్ దీవుల ప్రాంతంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదించబడలేదు.

New Update
Major earthquake in Indonesia

Major earthquake in Indonesia

ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. సోమవారం (జూలై 14) ఉదయం తూర్పు ఇండోనేషియాలోని తనింబర్ దీవుల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ భూకంపం సమయంలో ప్రజలు తమ ఇంటి నుంచి పరుగులు తీశారు.

అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం త్వాల్ నగరానికి పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో, భూమికి 98 కిలోమీటర్ల (60.89 మైళ్ళు) లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) కూడా ఈ భూకంప తీవ్రతను 6.7గా నిర్ధారించింది. 

Indonesia Earthquake 

Advertisment
Advertisment
తాజా కథనాలు