Kamala Haris: అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ , డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ లు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారిస్ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు.
Also Read: పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్
అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్ ఆగిపోవడంతో ఆమెకు ఏమి మాట్లాడాలో తెలియక ఒకే పదాన్ని రిపీట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిచిగాన్ లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
Also Read: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి
ఈ కార్యక్రమానికి దాదాపు 5 వేల మందికి పైగా మద్దతుదారులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ఇంకా 32 రోజులు మాత్రమే సమయం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో టెలీ ప్రాంప్టర్ ఆగిపోవడంతో 32 రోజులు అనే పదాన్ని ఆమె పదే పదే పలికారు.
Also Read: హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ఆ తరువాత ఆమె ఈ రేసు కష్టమైనప్పటికీ మనం విజయం సాధిస్తామంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సంఘటనతో ఉపాధ్యక్షురాలు బహిరంగ ప్రదర్శనల్లో టెలీ ప్రాంప్టర్ పై ఆధారపడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.