/rtv/media/media_files/2025/06/02/I2GS5qIpmF3TvCyrcZFN.jpg)
Italy Mount Etna eruption
Italy Mount Etna: ఇటలీలో మళ్లీ ప్రకృతి తన స్వరూపాన్ని చూపించింది. మెస్సినా, కటానియా నగరాల మధ్య ఉన్న మౌంట్ ఎట్నా(Italy Mount Etna) అగ్నిపర్వతం ఒక్కసారిగా ఉప్పొంగింది. మంగళవారం తెల్లవారుఝామున బలమైన పేలుడు సంభవించింది. ఈ అగ్నిపర్వతం నుంచి ఎగసిన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
ప్రకంపనలు
ఇటలీ జియోఫిజిక్స్ అండ్ వల్కనాలజీ సంస్థ తెలిపిన ప్రకారం, జూన్ 1 రాత్రి 10 గంటల నుంచి అగ్నిపర్వతం లోపల ప్రకంపనలు (tremors) మొదలయాయ్యి. కొన్ని గంటల తర్వాత, స్ట్రాంబోలియన్ శైలిలో పేలుడు ప్రారంభమైంది.
🌋🌋Mount Etna erupts:
— Mahakaal (@Mahakaal_0) June 2, 2025
Europe’s most active volcano sent huge plumes of smoke into the sky on June 2, 2025, forcing tourists to flee.
🔴 Aviation alert: Code Red (now Orange) due to ash clouds. 🔥 Lava fountains & continuous explosions reported from Southeast Crater.
📍 Sicily,… pic.twitter.com/crs3Dyvqdd
స్ట్రాంబోలియన్ పేలుడు?
స్ట్రాంబోలియన్ శైలి పేలుడు అంటే.. అగ్నిపర్వతం నిరంతరంగా పొగ, చిన్న రాళ్లు రూపంలో బూడిదను బయటకి విసురుతుంది. ఈ పేలుడు సమయంలో అగ్నిమయ రాళ్లు (volcanic bombs) వందల మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయి. ఇది భారీ పేలుడు కాకపోయినా, అధికారులు అప్రమత్తమయ్యారు.
MOUNT ETNA ERUPTS
— Jaycee (@JayceeTheFirst) June 2, 2025
Italy's most active volcano is once again unleashing its fury — spewing lava and ash high into the skies over Sicily.
Tourists fled as the eruption lit up the night. No injuries reported so far.@beholdisrael pic.twitter.com/VNfeMFZVvs
ఈ అగ్నిపర్వత పేలుడు నేపథ్యంలో విమాన ప్రయాణాలపై అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. ఉదయం 3:32 (UTC)కి రెడ్ అలర్ట్ ప్రకటించగా.. ఆ తర్వాత తీవ్రత కాస్త తగ్గడంతో ఉదయం 6:39 (UTC)కి ఆరెంజ్ అలెర్ట్ గా మార్చారు. ఈ హెచ్చరికలతో కొంత కాలం విమానాల రాకపోకలపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అగ్నిపర్వతం పేలుడు కారణంగా చుట్టుపక్కన ఉన్న పియానో వెటోరే అనే ప్రాంతంలో బూడిద పడిపోవడం గమనించారు. ఇది ప్రజలకు నేరుగా హానికరం కాకపోయినా, వాతావరణ మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!