Ratan Tata : భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ, 'భారతదేశం గర్వించదగిన వ్యక్తి ఆయన. మా రెండు దేశాల మధ్య స్నేహానికి న్యాయవాది అయిన రతన్ టాటా మరణించినందుకు నేను, నా ఇజ్రాయెల్‌లోని చాలా మంది ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నాం. రతన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
'ప్రపంచం పెద్ద హృదయం ఉన్న దిగ్గజాన్ని కోల్పోయింది'
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు పలువురు ప్రపంచ నేతలు రతన్ టాటాకు నివాళులర్పించారు. భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తన సంతాప సందేశంలో, 'భారతదేశం, ప్రపంచం పెద్ద హృదయం ఉన్న దిగ్గజాన్ని కోల్పోయింది. నేను అంబాసిడర్‌గా నామినేట్ అయినప్పుడు, భారతదేశం నుండి మొదటి గ్రీటింగ్ రతన్ టాటా నుండి వచ్చింది.
ప్రియ స్నేహితుడిని కోల్పోయింది
ఇదిలా ఉండగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ, 'రతన్ టాటా దూరదృష్టి గల నాయకత్వం ఉన్న వ్యక్తి. భారతదేశం, ఫ్రాన్స్‌లలో పరిశ్రమల ప్రోత్సాహానికి దోహదపడింది' అని అన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, 'భారత్‌కు చెందిన ప్రియమైన స్నేహితుడిని ఫ్రాన్స్ కోల్పోయిందని అన్నారు.
సుందర్ పిచాయ్ నివాళులు
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా గ్లోబల్ బిజినెస్ లీడర్‌లు కూడా నివాళులర్పించారు. రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ, సుందర్ పిచాయ్ ఇలా అన్నారు, 'రతన్ టాటాతో నా చివరి సమావేశం గూగుల్‌లో జరిగింది, మేము వేమో పురోగతి గురించి మాట్లాడాం, అతని దృష్టిని వినడం స్ఫూర్తిదాయకం అన్నారు. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వాన్ని మార్గనిర్దేశం చేయడంలో, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.'
దూరదృష్టి గల నాయకుడు: బిల్ గేట్స్
బిల్ గేట్స్ ఇలా వ్రాశాడు, 'రతన్ టాటా ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు, జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. నేను ఆయనను అనేక సందర్భాలలో కలుసుకునే అవకాశాన్ని పొందాను.ఆయన బలమైన ఉద్దేశం, మానవాళికి సేవ చేయడం ద్వారా ఎల్లప్పుడూ ఆకట్టుకున్నారని కొనియాడారు.
Also Read : ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి: నెతన్యాహు!