Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ మృతి

లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజరాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ మరణించారు. ఈ విషయాన్ని లెబనాన్ రక్షణ వర్గాలు స్వయంగా ప్రకటించాయి. ఈ దాడుల్లోనే మరో ఆరుగురు కూడా మృతి చెందారు. 

author-image
By Manogna alamuru
New Update
lebanon

Israel Attacks: 

వరుస దాడులతో ఇజ్రాయెల్ లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈరోజు జరాయెల్ అటాక్స్ లో హెజ్బుల్లాకు గట్టి దెబ్బే తగిఇంది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కమాండర్‌ ఇబ్రహీం క్వబైసీ హతమయ్యాడు. ఇందులోఅతనితో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇబ్రహీం.. హెజ్‌బొల్లా క్షిపణి వ్యవస్థకు కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.

నాలుగు రోజులుగా హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడుతోంది. మొదట ఎలక్ట్రానిక్ పరికరాల మీ దాడి చేసింది. తరువా రాకెట్లు, క్షిపణులతో వరుస దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్‌లో ఉన్న  క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ చెప్పింది. భవిష్యత్‌లోనూ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Also Read: Telangana: 2008 తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..

Advertisment
తాజా కథనాలు